Friday, November 4, 2022

శివోహం

నీవు దేవాది దేవుడవు, పరమాత్ముడవు, నేను కర్మకు భద్దుడైన జీవుడను శివా...
నేను చేసినతప్పులను మన్నించ మనను, దానికి తగిన శిక్ష అనునుభావిస్తాను శివా...
ఉన్నతోత్తముడవు నీవు, పుట్టుక లేని వాడవు, మేము ఉమ్మి తొట్టిలో పుట్టినవారము శివా...
సర్వసాస్త్రములు తెలిసినవాడవు నీవు, కాసులకోసం, విద్య కోసం,భాదలు పడేవారము శివా...   
ఆహారము వదలలేను, సంసార సుఖము వదల లేను, ఇంద్రియభోగములకు చిక్కితిని శివా
పాపము పుణ్యము తెలియని వాడను, మంచి చెడు తెలిసి కోలేని మనస్సున్న వాడను శివా
కర్మకు భద్దుడనై, నా వారి కొరకు, దేశముకొరకు, భక్తితో, ప్రేమతో  సేవ  చేస్తున్నాను శివా
నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...