ఒక్కసారి నీవు నీ భాదలను భగవంతుడికి చెప్పుకున్నాక అంతా అతనే చూసుకుంటడన్న నమ్మకంతో వాటిని గురించి అలోచించడం మానేయాలి. వాటిని గురించి మరళా మరళా భగవంతుడికి చెప్పనవసరం లేదు. నీ ప్రార్ధన నిజమైనదై ఉంటే అది తప్పక పరమాత్మ కు వినపడుతుంది. నీ ప్రార్ధన నిజమైనదని అతనికి కనిపించినపుడు నీ కొరకు ఏదైనా చేస్తాను. ఎంత భారమైనా సరే అతనే మెాస్తాడు..
సందేహానికి తావివ్వకు.
ఈ సృష్టినంతటినీ భరించి పోషించుచున్నవాడికి నీ భాదలు తీర్చడం పరమాత్మ కు పెద్ద సమస్య కాదు. కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుందనేది కేవలం నీ భక్తి విశ్వాసాలపై ఆధారిపడి ఉంటుంది. హృదయమందు భక్తి విశ్వాసాలు అభివృద్ది పరచుకొనక భగవంతుని అనుగ్రహం కావాలనుకోవడం అజ్ఞానం,అసంభవం.
No comments:
Post a Comment