వాడి పోతున్న
మొక్కకు నీరు పోస్తే
బతుకుతుంది కానీ
ఎండిపోయిన మొక్కకు కాదు
కృంగి పోతున్న
మనసుకు చేయూతనిస్తే
కోలుకుంటారు కానీ
జీవచ్చవాలుగా మారినప్పుడు కాదు
బంధాలు
అనుబంధాలు కూడా
స్వార్ధ పూరితం ఐతే
మానవత్వం మరుగున
పడుతుంది
ఇంక దైవత్వం మాటెక్కడ?
జీవం ఉన్న మనుషుల్లో
దైవాన్ని చూడలేని నాడు
No comments:
Post a Comment