Tuesday, February 28, 2023

శివోహం

శివా!నీకు చేరువ కావాలని
నీ చెంతకు చేరాను
నీలో చేర్చుకో నీవుగా మలచుకో
మహేశా . . . . . శరణు .

శివోహం

మనిషి దేవుడి గురించి, శాంతి గురించి ప్రేమ గురించి కలగంటాడు. వాస్తవంలో యుద్ధానికి, వినాశనానికి, దౌర్జన్యానికి సిద్ధపడతాడు.నిజమైన శాంతి కాముకుడు. ఆంతరిక పరివర్తన గుండా సాగుతాడు. ధ్యానమొకటే పరివర్తనకు కారణమవుతుంది.

Monday, February 27, 2023

శివోహం

శివా!నిన్ను తెలియుటకన్న  వైరాగ్యమేది
నిన్ను చేరుటకన్న వైభవం ఏది
వైరాగ్యం విరియనీ ఆ వైభవం పొందనీ
మహేశా . . . . . శరణు .

Sunday, February 26, 2023

శివోహం

నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది...

నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు, విజయ శిఖరాలను అధి రోహింప జేస్తుంది.

ఓం నమః శివాయ.

శివోహం

శివా!నెలవంక రూపాన సిగలోని పూవుగా
సోమ నేత్రము కాస్త చిదిమి పెట్టావా
అమృతమే కురిపించె అహర్నిశము .
మహేశా . . . . . శరణు .

శివోహం

ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం .

అందువల్ల
నేను లేకపోతే ఏమవుతుందో
అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు 
'నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు. 
*భగవంతుడి కోటానుకోట్ల దాసులలో 
అతి చిన్నవాడను* 
అని ఎఱుక కలిగి ఉందాం.

ఓం శివోహం...సర్వం శివమయం.

Saturday, February 25, 2023

మంచిమాట

మిత్రమా...
వంద మంది వంద రకాలుగా చెప్తారు.
అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు.
నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి.
ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు.
ఓం నమః శివాయ.

శివోహం

శివా!నా రాతలన్నీ నీ రాతలె గనుక
నేనేమి వ్రాసిన నీ పరీక్షలందు
ఉత్తీర్ణుని చేసి నన్ను ఉద్దరించవయ్యా
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
ఎన్నో జన్మములెత్తి, ఎత్తి, విసికి పోయాను...
ఈ జన్మతో, సరి చేయవలెను...
నే మరువనేప్పుడు, నీనామ జపమును...
శివ నీ చరణమ్ముల వద్ద రాలిపోతాను...
మహాదేవా శంభో శరణు.

Friday, February 24, 2023

శివోహం

శివా!మనసు వీడగ మనసు పడుతూ
మనసు వీడలేక మదన పడుతూ
సతమతమౌతున్నాను సాయమీయవా
మహేశా . . . . . శరణు .

శివోహం

నిన్న అన్నది ఒక జ్ఞాపకం..
రేపన్నది ఒక నమ్మకం..
నేడు అన్నది ఒక నిజం..
నిప్పులాంటి ఆ నిజాన్ని వెలుతురుగా మార్చుకుని..
గమ్యం వైపు సాగాలో,
లేక..
అవిరైపోయే అబద్ధాల కోసం..
ఆరాటపడుతూ ఆనందించాలో 
మనమే  నిర్ణయించుకోవాలి...

ఓం శివోహం...సర్వం శివమయం.

Thursday, February 23, 2023

శివోహం

దిక్కు లేనట్టి వారికి దిక్కు నీవు...
ఆకలైనట్టి వారలకు అన్నపూర్ణ...
పేద వారలపెన్నిది పెద్ద తల్లి...
బడుగు జీవుల పాలిటి కల్పవల్లి...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివ...
కలిమయాలో లో ఉన్న...
కల్తీ మనసుల మధ్య ఉంటూ...
కలుషిత మాయెను మనసు...
నీ సేవలేల చేయగలను...
నీ కేమిచ్చి  మెప్పించగలను...
సర్వం నీవే సకలం నీదే కదా శివ...
కనుకట్టు తొలగించు కనుపిప్పు కలిగించు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!మూణాళ్ళ ముచ్చట ఇలను ముగిసి
మరుభూమి బాటలో మేము పయనించు వేళ
స్వాగతించగ మమ్ము వేచి వున్నావా .
మహేశా . . . . . శరణు .

Wednesday, February 22, 2023

శివోహం

శివా!కల్మషాలన్ని కూలిపోయి
కాయమన్నది కాష్టాన కాలిపోయి
కూడ వచ్చినంత  కథ ముగియనిము
మహేశా . . . . . శరణు .

శివోహం

బంధాలు కొన్ని ఋణాలు తీరగానే బంధ విముక్తి అవుతాయి...
వారి నుండి దూరం పెరుగుతుంది...
కొన్ని రుణాలు జన్మ జన్మల నుండి వస్తూ ఉంటాయి...
అవే తల్లిదండ్రుల ఋణం, ఋషుల రుణం,దేవతా ఋణం...
ఇవి ఎప్పుడూ వెంటే ఉంటాయి.
మంచితనం, మానవత్వం, దయ ,పాప భీతి, భక్తి,భయం తో జీవితాన్ని ఆ దేవదేవుని పాదాల శరణు వెడితే జీవితం లో శాంతి ఆనందం లభిస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

హరిహారపుత్ర అయ్యప్ప.
సకల ప్రాకోటికి మోక్ష  మార్గం చూపు  జ్ఞాన  దీపమైనావు...
మానవులలో వుండే అంధకారమును తొలగించే జ్యోతి వైనావు...
మనస్సుకు ప్రశాంతత  కల్పించే  దివ్యమంగళ  స్వరూపుడైనవు...
నీవే శరణు.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, February 21, 2023

శివోహం

శివా!నీకంటూ ఓ రూపం లేదంటున్నా
నాకోసం నీవు  రూపుదాల్చి వస్తున్నా
ప్రతి రూపం నీవే ఐతే నీ ప్రతిరూపం నేనుకానా
మహేశా . . . . . శరణు.

శివోహం

మనసు మానవుడికి భగవంతుడిచ్చిన భిక్ష...
దాని కక్ష్యలో బందీగా కాకుండా బంధువుగా జీవిస్తే నిత్యమూ ఆనందార్ణవంలో అమృతస్నానమే...
మనసును మందిరం చేసుకుని, మన ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి...
అప్పుడు ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి, అదే అంతర్యామి కోవెలగా మారిపోతుంది.

ఓం శివోహం... సర్వం శివయమం.

Monday, February 20, 2023

శివోహం

ఆకారమే లేని లింగానివే నీవు...
జగమంతట నీవు...
జనమంతయు నీవే జంగమయ్యా...
వేయేల ఎంచి చూడగ బ్రహ్మాండమంత నీవే...
సకలం నీవే...
సర్వం నీవే...
ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, February 19, 2023

ఓం

---కన్నీటిని గుప్తంగా దాచడమూ నాకు తెలుసు!
    దాచడానికి అనేక సాకులు ఉన్నాయనీ తెలుసు!

    కంట్లో నలక ఏదో పడింది లాంటి
    అనేక అబద్ధాలు ఆడడమూ తెలుసు!

    రోదించి రోదించి అలసిపోయిన తర్వాత
    పకపకా నవ్వడమూ నాకు తెలుసు!!

     (ఒక హిందీ గజల్ లోని మూడు శేర్లకు భావానువాదం!

శివోహం

నా ఈ చిన్ని గుండె కలవరింపు..
నీ చిన్న పలకరింపు కోసమే అని తెలిసి కూడా అలా మౌనం గా ఉంటావేమి శివ..
శివయ్య శివయ్య అని పలుకుతుంటే పలకవేమి.
ఒక్కసారి పలికి నా జన్మ ధన్యం చేయవేమీ తండ్రి...

మహాదేవా శంభో శరణు.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

శివా!అంతరాయములు తొలగించు
అంతరాన నాకు అగుపించు
నన్ను నీవుగా ఎఱిగించు.
మహేశా . . . . . శరణు .

Saturday, February 18, 2023

శివోహం

శివా!ఈ మట్టి స్నానాల మాట కట్టిపెట్టు
ఈ మట్టి బొమ్మ మరణాలు ముగిసేట్టు
ఒక్కసారి నాకు నీ అనుగ్రహ భిక్ష పెట్టు
మహేశా . . . . . శరణు .

Friday, February 17, 2023

శివోహం

సంపద హోదా గుర్తింపుని ఇస్తాయేమో కానీ గౌరవాన్ని కీర్తినీ అన్నిటి కన్నా మిన్నగా మనఃశాంతిని ఇవ్వలేవు...

మనశాంతి దొరికేది కేవలం నీ సేవలోనే తండ్రి...

మహాదేవా శంభో శరణు.

శివోహం

ఒకప్పడు శివరాత్రి రోజు మాత్రమే నీ
నామస్మరణ...

మరి ఇప్పుడు ప్రతి రోజు ప్రతి గడియ నీ నమస్మరణే
ఇంటినిండా నీ ప్రతిమలే ఎలా ఎప్పుడు 
ఎటు నుంచి వచ్చినా నువ్వు కనిపించాలని....

ఈ రోజే కాదు ప్రతిరోజు నాకు శివరాత్రే కదా శివ.

ఆత్మబంధువులకు ఆత్మీయ మిత్రులకు శివరాత్రి శుభాకాంక్షలు.

శివోహం

అడుగుదామంటే నీవే తొలి బిక్షగాడివి...
ఇద్దామంటే నీతలతో నీ చెంటే అన్నపూర్ణమ్మ 
ఇంకేం ఇవ్వను నీకేం ఇవ్వను...
నన్నే నీకిచ్చుకుంటా గొంతున దాచుకో శితికంఠా...

మహాదేవా శంభో శరణు.

Thursday, February 16, 2023

శివోహం

శివా!వేదాలు చెప్పుకొనగ వచ్చాను
వాదాలు తృంచగా నేను
నా వంతున నీవు నిలువరావయ్యా.
మహేశా . . . . . శరణు .

శివోహం

త్రిశూలం పట్టుకుంటావు..
శ్మశానంలో ఉంటావు...
నువ్వంటే భయంతో చావాలి కానీ...
చచ్చినాకా నీదగ్గరకే చేరాలని తపస్సు ఏంటయ్యా నాకు...

మహాదేవా శంభో శరణు.
@ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

Wednesday, February 15, 2023

శివోహం

శివా!చెట్టు క్రిందకు చేరాను విద్య నీయి
అవిద్య అన్నది తొలగనీయి
మిధ్య ఏదో తెలియనీయి
మహేశా . . . .  .  శరణు .

Monday, February 13, 2023

శివోహం

శివా!నీ అంకాన విఘ్నపతి
నీ శంఖాన శుభం గతి
విశ్వపతి నీవే శరణాగతి
మహేశా . . . . . శరణు .

Sunday, February 12, 2023

శివోహం

శివా!పగలెండగా ప్రభవించేవు
రేయెండకు తోడయ్యావు
మాకండగ మసలాడేవు
మహేశా . . . . . శరణు .

Saturday, February 11, 2023

శివోహం

శంభో...
ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఇంకా ఒకటి రెండు రోజులు ఎక్కువ బ్రతికి ప్రయోజనమేముంది..
తుప్పు పట్టేకన్నా...
శివ నీ దయ.

Friday, February 10, 2023

శివోహం

పురుషులకన్న ఉత్తముడవు...
శబ్ధ, జ్ఞాన, సంపన్నుడవు...
అశుభాలను తొలగించి అందరికి శుభాలు కల్పించే వాడవు నీవు...
నీవే శరణు..

ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా. 

శివోహం

శివా!కూడి రానా నీతో నేను
ఆ అమ్మ భిక్షను అందనెంచి
జ్ఞాన వైరాగ్య సంపద జ్ఞాన మెరిగి
మహేశా . . . . . శరణు .

శివోహం

ఈ శరీరం అనే సంపద నీ ప్రసాదమే తండ్రి...
ఈ ఉత్కృష్టమైన మానవ జీవనం  నీ  అపార మైన కారుణ్యమే...
నా ఈ దేహంలో ని  వేలాది  నాడులు...
నీ నామ రూప దివ్యగానం చేస్తూ
పాల పొంగులా పొరలే అనందాన్ని
నా ఎదలో  ఉవ్వెత్తున ఉప్పొంగనీ తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Thursday, February 9, 2023

శివోహం

అమ్మ...
నీ శక్తి అంత ఇంత అనలేను 
సర్వ మంత నీదే తల్లి...
నీ దయకు అడ్డు లేదు...
నిన్నే మోము కొలుచు చున్నాము అమ్మగా...
శివుని వలే మాకు రక్ష నీవు...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

శివా!ఈ బ్రతుకు బండి పయనంలో  
సాయమూ నీవే సాక్ష్యమూ నీవే 
తెలుసులేవయ్యా తెలియరావయ్యా
మహేశా ..... శరణు

శివోహం

పూర్వజన్మ పాపమేమో...
వీడక వెంటాడుతోంది.....
ప్రతి క్షణమూ మరణమై....
అనుదినమూ నరకమై.....
బ్రతుకేదుర్భరమైపోతుంది......
నీ రూపమే మనసున నిలిపి...
నీ మంత్రమే జపియించి...
నీవే రక్షకుడవని నమ్మితి
నీవే ముక్తి ప్రదాతవని
నీవే మోక్షదాయకుడవని నీదరిజేరితి సదాశివా
నీ జ్ఞాననేత్రవీక్షణతో అనుగ్రహించెదవో  లేదా ముక్కంటితో భస్మమొనరించి మరుజన్మలేని ముక్తినొసంగదెవో నీ దయ సదాశివా.

మహదేవా శంభో శరణు.

Wednesday, February 8, 2023

శివోహం

శివారాధనకు
ఐశ్వర్య
ఆడంబరం
అక్కర లేదు...
శివుణ్ణి తలవాలి అనే మంచి మనసు ఉంటే చాలు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శంభో...
నా బాధలో నీడవి నీవు
నా సంతోషంలో తోడువు నీవు
నా కష్టంలో భాగం నీవు
నా ఇష్టంలో భావం నీవు
నా మనసులో రూపం నీవు
నాలో మౌనం నీవు
నాలో శ్వాసే నీవు
నా హృదిలో వెలుగే నీవు
నా పయనం నీ పదసన్నిథికే
నన్ను దరిజేర్చుకొనేదీ నీవే
నా ఆరాధ్యదైవం నీవే

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!స్థూలంగా నేను , సూక్ష్మంగా నీవు
సూక్ష్మంలో స్థూలం,స్థూలంలో సూక్షం
నీ లీలా వినోదం కలిగించును మోదం
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...