పూర్వజన్మ పాపమేమో...
వీడక వెంటాడుతోంది.....
ప్రతి క్షణమూ మరణమై....
అనుదినమూ నరకమై.....
బ్రతుకేదుర్భరమైపోతుంది......
నీ రూపమే మనసున నిలిపి...
నీ మంత్రమే జపియించి...
నీవే రక్షకుడవని నమ్మితి
నీవే ముక్తి ప్రదాతవని
నీవే మోక్షదాయకుడవని నీదరిజేరితి సదాశివా
నీ జ్ఞాననేత్రవీక్షణతో అనుగ్రహించెదవో లేదా ముక్కంటితో భస్మమొనరించి మరుజన్మలేని ముక్తినొసంగదెవో నీ దయ సదాశివా.
No comments:
Post a Comment