Saturday, March 11, 2023

*సాక్షాత్కారం అంటే ఏమిటి?*

*సాక్షాత్కారం అంటే ఏమిటి?* 

ఆధ్యాత్మికమైన విషయాలు ప్రత్యక్షంలోకి వస్తే దాన్నే సాక్షాత్కారమంటారు. ఆధ్యాత్మిక విషయాలంటే ఆత్మ పరమాత్మలకు సంబంధించిన విషయాలు, నిర్దిష్టంగా చెప్పాలంటే ఇంద్రియాతీత ప్రత్యక్షజ్ఞానాన్ని సాక్షాత్కారమని అనాలి. 

కాదు మానసిక సాక్షాత్కారమే, సాక్షాత్కారమని కొందరు, మనస్సు సంబంధం కూడా పోయిన తరువాతే సాక్షాత్కారం కలుగుతుందని కొందరు అంటారు. 

భౌతిక ప్రపంచమే తమ పరిధిగా గల సాధకులు కొందరు అద్భుత శక్తులను ప్రదర్శిస్తూంటారు. వారిది ఇంద్రజాలం అనిపించుకుంటుందే తప్ప 'సాక్షాత్కారం' అనిపించుకోదు. అది ఒక వ్యసనంలాంటిది. 

ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందినవారు. భౌతిక ప్రయోజనాలు కలిగించలేరా అంటే ప్రత్యేకించి కలిగించాలని వారు ప్రయత్నం చేయరు కాని వారి సన్నిధే సమస్త శుభాలు కలిగిస్తుంది. 

తమ ఆపదల్ని గట్టెక్కించమనో, వ్యక్తిగత ప్రయోజనాల్ని కూర్చమనో వచ్చిన వారిని కూడా ఆ దివ్యసాధకుడు పో, పొమ్మని నిరాశపరచడు. మంత్రమో, స్తోత్రమో ఉపదేశించి, ఆచరణకు మార్గదర్శనం చేస్తాడు. ఫలితాన్ని భగవంతుడి ఇచ్ఛకే వదులుతాడు. 

ఉపనిషత్తుల ప్రకారం, భగవదనుగ్రహం వుంటే సాక్షాత్కారం కలుగుతుంది. దానికి గురువుగారి ఉపదేశం వుండాలి. ఆ ఉపదేశాన్ని సాధకుడు అనుసరించాలి. సద్గుణాలను అలవరుచుకోవాలి. ధ్యానం, యోగం, చెయ్యాలి. ఆత్మవిచారం జరగాలి. మధుర భక్తి అనుభవంలో మునిగి తేలాలి. అదే దైవసాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుంది.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...