భగవంతుని తత్వం
భగవంతుని పై చూపే ప్రేమనే భక్తి అని అనుకోవచ్చు. భగవంతుడు లేనిప్రదేశం లేదు అంటారు. భగవంతుడు సర్వభూతములలో అంతర్భూతమై ఉంటాడు కనుక సర్వప్రాణులపైన ప్రేమ భావన కల్గి ఉండడం, సర్వపాణులపై సమదృష్టి కలిగి ఉండడమూ భగవంతునిపై ప్రేమ చూపించడమే. అంటే భగవంతునిపై భక్తిని కలిగి ఉండడమే. ఇటువంటి భక్తి ప్రతిమనిషిలో అంకురించాలి అంటే దేవాలయ సందర్శనాలు మార్గాలుగా ఉంటాయ. అక్కడ బోధించే ప్రతివిషయమూ మనిషిని మంచినడవడిలో నడిపించేట్టు చేస్తాయ.
కేవలం గుడికి వెళ్లడం దర్శనం ఛేసుకోవడమే భక్తి కాదు అక్కడ అర్చనాదులు నిర్వహించడవమే భక్తి అని అనలేము. భగవంతునిపై భక్తి అంటే భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతునికి మారురూపులుగా ఉండాలి.
దేవాలయాలు విద్యాకేంద్రాలు. అక్కడ చెప్పే పురాణ పురుషుల జీవితాలలోనో, లేక గీత బోధనో పెద్ద వారి అనుభవాలనో లేదా రామాయణ మహాభారత సన్నివేశాలో సంఘటనలనో ప్రవచనాలుగా వినిపిస్తుంటారు. వాటిని విన్నవారికి అవి జీవిత పాఠాలుగా పనికి వస్తాయ.
గుడికి వచ్చేవారికి ప్రసాదరూపంలో ఆహారం పెడుతుంటారు. ఆహారం రైతు పండించినా అది ప్రతిమనిషికి చేరేలోపు ఎందరి చేతుల్లోకి మారి వస్తుంటుంది. రైతును దేశానికి వెన్నుముకే కాదు భగవంతునికి ప్రతిరూపు కూడా.్భగవంతుడిచ్చిన గాలి, వెలుతురు, నీరు ఇలాంటి వాటిని ఉపయోగించి పండించిన పంటను తిరిగి దేవునికి సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకోమనే బోధ ఈ ప్రసాదరూపంలో అందుతుంది. అంతేకాదు ఉన్న ప్రసాదాన్ని నలుగురు కలసి పంచుకొని తినడంలోను ఐకమత్యం చూపించాలనే ప్రసాద వితరణలో కనిపిస్తుంది.
గుడిని పరిశ్రుభంగా ఉంచడంలో పరిసరాల శుభ్రత ఆరోగ్యాన్ని భద్రతనేర్ప రుస్తుంది అనేది కూడా ఈ దేవాలయాలు చెబుతుంటాయ.ఇన్ని విషయాలను బోధించే చైతన్యాలయాలు దేవాలయాలు కనుక అక్కడ కేవలం దేవుని దర్శనమే కాకుంఢా భగవంతుని తత్వాన్ని తెలుసుకొని జీవితాన్ని బాగుచేసుకోమని ప్రతివీధిలోను మన పూర్వులు ఓ దేవాలయాన్ని నిర్మించారు .
No comments:
Post a Comment