మనస్సు ఈ ప్రపంచంలో ఎన్నోజన్మలు అనిత్యమైన సుఖాల కోసం తిరిగి తిరిగి అలసిపోయి చివరికి ఇవేవి నిత్యం కాదని పరమాత్మా వైపుకి తిరుగుతుంది మనస్సు అదే భక్తి అప్పుడు శాంతి తృప్తి లభిస్తాయి.
ఇన్నాళ్లు నేను నాది అని అహంకార మమకారాలు పెంచుకున్నాను ఇప్పుడు తెలిసింది నేను కాదు నాది కాదు
అంతా పరమాత్మే నేను కేవలం నిమిత్త మాత్రుడను అనే భావన కలుగుతుంది అదే శరణాగతి.
మన భక్తికి మెచ్చి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.
మనం బయట ప్రపంచాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని వెతికి తెలుసుకుంటాము, కానీ బయట వెతకాల్సిన అవసరం లేదు.
No comments:
Post a Comment