Tuesday, April 4, 2023

శివోహం

శివుడంటే ఆలోచన...
శక్తంటే ఆచరణ...
ఈ రెండూ విడదీయరానివి...
ఆలోచన లేని ఆచరణ...
ఆచరణ లేని ఆలోచన లోకానికి అవసరం లేదు...
కనుక, ఈ రెండిటి సమన్వయధార, శ్రీవిద్యాస్వరూపంగా, యోగత్రయ శక్తిగా, శంకరులు సౌందర్యలహరిని సృష్టించారు.  శ్రీవిద్య ద్వారా, శ్రీచక్రోపాసన ద్వారా, కవితాగానం చేస్తూ అమృత భాషలో భగవత్పాదులు సాగించిన ఆనంద-సౌందర్యలహరిని.. గాఢంగా, తీవ్రంగా అధ్యయనం చేయాలి. శక్తి నుండి పుట్టిన పరాగ రేణువును బ్రహ్మ గ్రహించి లోకమును సృష్టిస్తున్నాడు.
ఒక్క శిరసుతో ఆ రేణువును మోయలేని విష్ణువు, పదివేల శిరసులున్న శేషుడై మోయగలుగుతున్నాడు. పరాగ రేణువును చూర్ణము చేసి, విభూదిని ధరించి శివుడు లయకార్యమును నిర్వహిస్తున్నాడు.
ఈ ముగ్గురూ తమ శక్తులను ఆమె పాదపద్మ పరాగ రేణువు నుండి గ్రహిస్తున్నారు. ‘సౌందర్యలహరి’ ఈ విధంగా సాగుతుంది. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చక్రం, ఒక్కొక్క చక్రంలో బీజాక్షరాలున్నాయి. అదొక తీవ్ర విచారణ!

శంకర భగవత్పాదులు లలితా సహస్ర నామ స్తోత్రానికి భాష్యం రాయలేదు. ‘సౌందర్యలహరి’ని రచించి ఆ లోటును పూరించారు.
లలితా సహస్రనామ స్తోత్రానికి సౌందర్యలహరి, శ్లోకరూపంలో ఉన్న భాష్యమే! అనేక శాస్త్రాల రహస్యం తెలిసి, కవితామృతం రుచి ఎరిగి, మరిగి, అనల్పకల్పనా శక్తి కలిగి శ్రీవిద్యను ఉపాసించాలన్న తీవ్ర కాంక్షలున్నవారికి సౌందర్యలహరి, నిజానికి అసలు విద్య.
అది అనుగ్రహించేది అచ్చ తెలివినే. అనేక స్థాయుల్లో ఆకళింపు చేసుకోవాలి. వైకల్యం సాధించుకోవాలి. దేశ, కాలాతీతంగా భగవత్పాదులు మానవాళికి అనుగ్రహించిన సంవిద్‌ఫలం, సౌందర్యలహరి

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...