Friday, April 7, 2023

హరే గోవిందా

మంగపతి నిన్ను చూడ వచ్చినామురా
ముడుపులన్ని మూటగట్టి తెచ్చినామురా
                                           " మంగ"
పిల్లా పాపలతోటి కొండ ఎక్కుచూ
అలుపైనా సలుపైనా నీకు మొక్కుచూ
గోవిందాని నీ నామం స్మరణ చేయుచూ
చేరినాము నీ గుడికి వేంకటేశ్వరా
                                           "మంగ"
బారులు తీరిన జనము చూడ బారెడు
వరుసలలో వేచియుండ గుండె జారుడు
నా కనులారా నీ రూపం చూడనీయరు
నిముషమైన ఆ గడపను నిలువనీయరు
                                       "మంగ"
వెనుతిరిగి నిను చూడ వేంకటేశ్వరా
ములుగుతోంది నా మనసు ఏమి సేతురా
వెనుక వారు వెన్ను తట్టి నెట్టి వేయగా
వెడలినాను నీ రూపం నెమరువేయుచూ
                                        "మంగ"

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...