ఎరుక మరుపు అనే
రెండు తాళ్లతో కట్టి జీవుని
ఈశ్వరుడు ఆడిస్తూ ఉన్నాడు.
మన నుండి జ్ఞాపకాలు తొలగిపోతే
అదే నిద్ర అదే మరణం
మనకు జ్ఞాపకాలు తగిలితే
అదే బ్రతకడం అదే జననం
జ్ఞాపకాలు ఇవ్వడం కానీ
తీసేయడం కానీ మనకు మనమే చేసుకోవడం లేదు
ప్రత్యేకమైన ఒకానొక శక్తి ఈ క్రియలు చేస్తూ ఉంది.
కోమాలో ఉన్నవాళ్లు బతికే ఉంటారు
కానీ చలనం ఉండదు
కారణం ఏమిటి ?
జ్ఞాపకం లేదు అంతే.
ఒకవేళ జ్ఞాపకం వస్తే
లేచి కూర్చుంటారు
నిజంగా సత్యంగా మనం ఆడించబడుతున్నాం అన్నది సత్యం.
మనకు ఎవరితో సత్సంబంధాలు ఉన్నా లేకపోయినా నష్టం లేదు కానీ మనల్ని ఆడించేవాడైనా ఆ ఈశ్వరునితో మాత్రం సత్సంబంధాలు తప్పనిసరిగా ఉండాలి.
ఆ ఈశ్వరుడు ఎవరో కాదు ఆత్మ రూపేనా మనలో సాక్షిగా దివ్యంగా ప్రకాశిస్తున్నాడు.
ఆ సాక్షికి ఉప సాక్షిగా ఉపలబ్దంగా
ఎప్పుడు మనం ఉండాలి
అంతర్యామి అయినా ఈశ్వరునితో
మన బాధలు సంతోషాలు పంచుకుంటూ పలకరిస్తూ అతనితో ఉండాలి
ఇలా తనలో తాను ఎవరైతే ఉంటారో
వారు నిజంగా ధన్యాత్ములు.
అంతేగాని ఎప్పుడూ
ఎవరో ఒకరు తోడుగా ఉండాలి
లేకపోతే నాకు ప్రొద్దుపోదు దిక్కు తెలియదు అన్నట్లుగా మనిషి బ్రతకకూడదు
No comments:
Post a Comment