Thursday, May 25, 2023

శివోహం

అమ్మా...నీ అనురాగం..
నా ఆరోగ్యం మరి ఆనందం
నాలో చైతన్యం మరి ఉత్సాహం
నీ అనురాగం...కేవల అనురాగం
మధుర తలపుల స్మ్రతి నీవే
నోటికందే భృతి నీవే
ఆధారానికి పట్టు తప్పని శృతి నీవే
సమస్యలను పరిష్కరించే ధృతి నీవే
కృతులన్నీ ముమ్మాటికీ నీవే..నీవే..
మాయా లోకపు బురదను వదిలించగా రావే
నా....హృదయములోనికి....
నా మెదడు గ్రహింపుకి...రావే...
ఇలలో వున్నంతవరకు నిండారగ
నా దృష్టికి స్పష్టత కావే
ఆనందరసాన..నీ పరిష్వంగాన
స్థితిధాత్రినై వెలగనీవే.....
కర్త,కర్మ,క్రియాకృతులు నీవైపోవే
జననీ...జననీ...దరహాసోజ్వలనీ...

No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...