Tuesday, May 23, 2023

శివోహం

స్వేచ్ఛగా విహరించే
నా ఊహల ప్రపంచంలో
నీ పాద రేణువునై 
ఇసుమంత గర్వించా
నిత్య ఘోషయైన
నా అంతరంగ సాగరాన
ఆటుపోటుల మయమై
అనుదినము కృశించా
భౌతికంగా నేను
అవధులలో చరించినా
భావ విశృంఖల ప్రవాహాన
అనంతమై శోభించా 
ఎల్లలు లేని నా భక్తి ప్రేమ తత్వాన
నీ విలాసాన్ని కనుగొన్నానని హర్షించా
నీ దయా ప్రబోధాన నను శాసించే 
నీ చూపుల గని పరవశమై తరించా...
ఓం శివోహం...సర్వం శివమయం.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...