Wednesday, May 24, 2023

శివోహం

శివ...
మదిలో కలవరం కనిపించే లోకం పోకడకు
యదలో అలజడి కదిలే కాలం తీరుకు కాదేమో...
నీ ఆటలో పావును కదా...
బంధాల బందీకానలో నను బందించి ఆశల పాశాలలో శోదించి మనుసును మరీ రాటుదేలుస్తున్నావు...
మహాదేవా మరో అధ్యాయానికి తెర తీస్తున్నావా...
ఏ తీరం చేర్చినా భారం భరోసా నీదే తండ్రి...
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! ఎప్పటి నుంచో తెలియదు కానీ ఈ హృదయంలో *ఆశ* అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది... కామ, ...