Friday, May 26, 2023

శివోహం

_ మహే శా _! పాప వినాశ _! కైలాస వాసా _! ఈశా _! నిన్నే నమ్మి నాను దేవా _!
నీల కంధర _!
మహాదేవ అంటేనే చాలు _! కరుణించి బ్రోచే దేవర_!
మట్టి లింగమున కొలువై ఉండి _!
   దీపించే మహానుభావా _!
  
 నీవు కరుణిస్తే గానీ__!
__దయతో చూస్తూ ఉంటే గానీ,_!
 __ఆర్తితో పిలిస్తేనే గానీ_!
 నీవు తప్ప ఇతరు లెవరు_
   కాచే ప్రభువు లే రంటు__
మొర పెట్టు కుంటే నే __గానీ_!
నిను గాన లేరెవ్వెరు!
దరికి చేరలేరు ఎన్నడూ_!
చనగ లేరు నీ వైపునకు _!
  దర్శించ లేరు మట్టి లింగ మందున కూడా _!
 బంధువును పిలిచి నట్టుగా _
పిలిస్తే నీవు రావు కదా_!
ఆత్మార్పణ భావంతో _
ఆర్ద్రత, ఆవేదన లతో
 శరణంటే _మరవక వచ్చి_
రక్షించే విభుడ వు నీవే_!
 సర్వ రోగ భవ భయ హర్తవు నీవే_!
  సకల లోక పాలన కర్తవు_ నీవే_! 
 నిఖిల భువనాలకి భర్తవు_ నీవే_!
    పత్ర పుష్ప ఫల తోయ అర్పణతో నే 
తృప్తి
పొందు భోళా శంకరుడ వు నీవే _!  
నిర్గుణ నిరాకార నిరామయ
నిరంజన __
 చిదానంద స్వరూ పుడవు నీవే_!
  సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ పదార్థ!రూపుడ వు నీవే_!
   పరబ్రహ్మ వు నీవే _!

 భక్త సులభు డవు _!
 దీన బంధు డ వు_!
  కారుణ్య అమృత దయాంత రంగుడ వు _!
 గౌరీ మనోహర_
పురహర _హర హర _!
మహాదేవ హర _శంభో శంకర_!
 పాహి పాహి పరమేశ్వర _ భవ హర_!
 గంగాధర శశాంక శేఖర_!
 నాగ భూషణ _ నటరాజ , శేఖర _!
 హర హర మహాదేవ శంభో_ శంకరా _!
     పాహి పాహి పరమేశ్వర! శంకర_!
  రక్ష ! రక్ష_!
పార్వతీ మనోహర_!
 
   నిరత ఆనంద లహరి లో 
తేలాడు చుందు వట_!
  బ్రహ్మానందమున ఓల లాడు తూ ఉందువట _!
 నిష్చల సమాధిలో
  అంతర్ముఖు డవై _
 ఆనంద బ్రహ్మవై _
     అండ పిండ బ్రహ్మాండ_
సంధాన కర్త వై_!
 సృష్టి నిర్వహణ సంస్కర్త వై _ నియంత వై"!
   మహోగ్ర తపో దీక్ష ధారి, రుద్రుడవై _!
 హిమగిరి తనయ ప్రేమా
మృత పిపాసకు డ వై_!
హరుడవై _!
  ప్రమథ గణ సహిత సంచారివై _జోగివై_!
 భూత ప్రేత పిశాచ_
 స్మశాన వాసివై_ యోగి వై"!
 దేవాది దేవుడై _ కైలాస వాసివై _!
 నంది వాహ నుడవై _!
 కుమార గణేశ పుత్ర యుక్త_!
 అర్ధ నా రీశ్వ రా _ ఉమా మహేశ్వర! హరా_!
 సాంబ సదాశివ _!  
 శివ _! 
 నీవే సమస్తంబు _!
నీవే విశ్వ నాథుడ వు_!
  దయాశాలి _! త్రిశూ లి_!
 చంద్ర మౌళి!
   నన్నేలు మయ్య _!
 నాగేంద్ర హారి_!
  కృప జూడు మయ్య_!
జటాజూట ధారి _!
   మొరాలించి పాలించి
  నీ సన్నిధి చేర్చు మయ్య_!
  చంద్ర కళా ధర _!
 సాంబ దిగంబర _! నమో నమో _!

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...