Thursday, June 29, 2023

శ్రీమాత్రే నమః

ఈ సృష్టికి మూలమైన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తే వివిధ సందర్భాల్లో వివిధ రూపాలను ధరించి శత్రు నాశనం చేసి ఆస్తిక లోకాన్ని కాపాడుతూ వస్తుంది. ఆమె పార్వతి, ఉమ, ఇంద్రాణి, పరాశక్తి, ప్రత్యంగిదేవి. అన్ని రూపాలూ ఆమెవే. ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది. అందుకే ఆమె ఆది పరాశక్తి అయింది.

అమ్మ పిలిస్తే పలుకుతుందీ అంటే, అయ్య పిలిస్తే పలకడని కాదు. అయ్య ప్రత్యేకత వేరు. అమ్మ ప్రత్యేకత వేరు. అమ్మ అందరికీ అమ్మే. అసలు అమ్మ అనే పదమే ప్రేమ స్వరూపం. అందువల్ల అమ్మ ఆ ప్రేమ స్వరూపి, ఆనంద స్వరూపి, కరుణా స్వరూపి దయామయి. అందువల్ల అమ్మ నామ స్మరణ ప్రేమమయమే. అందుకే సాయిబాబా ప్రేమ గరించి విశిష్టంగా చెప్పేవారు. తోటివారిని ప్రేమించమని చెప్పడంలో రహస్యం ఇదే. అందుకే ఆయన రాబోయే కాలంలో ప్రేమ సాయిగా వస్తానని చెప్పారు కూడా. మనస్సు శాంతిగా ఉండాలన్నా, బుద్ధి కావాలన్నా, యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, ధైర్యం, కార్యసిద్ధి, బలం, ఆయురారోగ్యాలు-ఇలా ఏది కావాలన్నా అన్నిటికీ ఆది మూలం ఆ తల్లి. అహంకారం, ఈసుఅసూయలు, కష్టాలు, నష్టాలు,కోపాలు, తాపాలు, రోగాలు, రొష్టులు, అప్పులు ఇవన్నీ తొలగిపోవాలంటే ఆ అమ్మ దయ ఉండాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రుతి, స్మృతి, ఇతిహాస, పురాణ సదాచారాలనే ఐదింటిలో ఒకటైన ధర్మ స్వరూపంగా అమ్మ చిదాకాశ స్వరూపిణిగా వెలుగొందుతోంది.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...