Thursday, June 22, 2023

శివోహం

నీలి కొండ చేరినాము మాధవా
                  నిన్ను చూసి మురిసినాము మాధవా
చెంత చేరి నిలిచినాము మాధవా
          మా చింతలన్ని మరచినాము మాధవా 
మాధవా నీలి మాధవా.

ఎన్నాళ్ళగ విన్నాము ఇన్నాళ్ళకు కన్నాము
ఎంత గొప్ప వాడివయా మాధవా
దివ్యమైన నీ రూపం చూడలేని మాకళ్ళు
చీకటింటి లోగిళ్ళు మాధవా.     
జన్మ జన్మ పాపాలు జగతిలోన శోకాలు
తొలగునులే నిన్ను చూడ మాధవా
మాధవా నీలి మాధవా...

చిత్రమంత విన్నాము చిత్తరువులు కన్నాము
కర చరణము కానలేదు మాధవా
దారుశిల్పమన్నారు ధరణి చిత్రమన్నారు
దాగివుంది నీ తేజం మాధవా
భోగపురి ఈ పురి భోజింపగ నీకు సరి
భజియింతుము మరి నిన్నే మాధవా
మాధవా నీలిమాధవా

నీలి చక్రమున్నది నింగినంటు చున్నది
నీ తేజమునే చాటుతోంది మాధవా
నీ పతాకపు రెపరెపలు గాలికెదురు తిరిగేను
నీ చిత్రమైన లీల యిది మాధవా
తీరు తెలుసుకున్నాను పేరు తలచుకున్నాను
నిన్ను కొలుచు భాగ్యమీయి మాధవా
మాధవా నీలిమాధవా

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...