గౌరీ దేవి శక్తి స్వరూపము అయితే...
శివుడు చైతన్యం...
శక్తి ఉంటే చైతన్యం ఉంటుంది,ప్రాణం ఉంటే శక్తి అంటే శివం ,లేకుంటే శవం...
అందుకే శక్తి స్వరూపిణి దేవి కృప కోసం ,ఆమె ప్రసాదంగా అనుగ్రహించే భిక్ష కోసం , ఆమె వద్దకు భిక్షాం దేహి అంటూ అర్థించాడు శివుడు ,
అన్నపూర్ణా దేవి ఇచ్చే భిక్ష వలన శివునికి శక్తి వస్తుంది ,దానితో చైతన్యం ,దానితో భక్తి జ్ఞాన వైరాగ్యం కలుగుతాయి...
ఆహారం భిక్ష గా గ్రహించడం వల్ల పొందే ప్రాణ శక్తి తో మానవుడు అద్భుతాలు సృష్టిస్తూ దైవానికి చేరువ అవుతున్నాడు
ఇదంతా భిక్ష మహిమా
ఇచ్చేవాడు ,శివార్పణం అని భావిస్తూ భిక్షను ఇస్తే,
గ్రహించే వాడు పరాత్పరుని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటే ,ఆ పరమాత్మ ఆ ఇరువురికీ తన కృప ను అందజేస్తూ ఉంటాడు , అనగా దాత గ్రహీత ఇద్దరూ శివ స్వరూపాలే.
No comments:
Post a Comment