మనం జీవితంలో ఉన్న వాటి గురించి కాకుండా, మనకులేని వాటి గురిం చే ఎక్కువగా ఆలోచిస్తూ ఆరాట పడుతూ వాటిని పొందడం కోసం తరుచుగా బాధపడుతూ ఉంటాం...
అవి పొందడం వలన మనం తృప్తిగా ఉండగలమా ఆ పొందిన వాటిని దూరం చేసుకోకుండా చూడగలమా లేక పొందిన వాటితో,మనం నిరంతరం ఆనందంగా ఉండగలమా ఇది ప్రతీ మనిషికి ఎప్పుడూ ఎదురయ్యే ప్రధానమైన సమస్య...
ధనం ఈ రోజు ఉంది,ఉంటుంది అది రేపు పోతుంది...
ఆరోగ్యం ఉంది ఇపుడు అది మారుతూ పోతూ ఉంటుంది...
స్నేహితులు, ఆత్మీయులు బంధువులు కూడా దూరం అవుతూ ఉంటారు ఎవ్వరూ మిగలరు, చివరకు నేను, నాది అనే ది కూడా పోతాయి...
అనుక్షణం కాలంతో బాటూ మార్పుకు గురి అయ్యే దానికి మనం ఆపలేం...
ఉన్నవన్నీ పోయేందుకే ఉన్నాయి...
మరి ఈ ఆరాటం ఎందుకు మిత్రమా.
No comments:
Post a Comment