Thursday, August 17, 2023

శివోహం

శంభో!!!నువ్వు నేను సగం సగం....
నాలో నువ్వు సగం.....
నీలో నేను సగం....
ప్రాణం నాది అయితే.....
అందులో ఊపిరి నువ్వు....
జీవం నాది అయితే.....
అందులో ఉనికి నువ్వు....
హృదయం నాది అయితే.....
అందులో స్పందన నువ్వు....
ఈ దేహం నాది అయితే....
అందులో ఉన్న ఆత్మ నువ్వు.....
జీవాత్మను నేను అయితే.....
పరమాత్మవు నువ్వు....
బాహ్యంగా నేను.....
అంతర్లీనంగా ఉన్నది నీవే కదా హార...
మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! కాలం నన్ను తడిసిన కాగితంగా మార్చేసింది... రాయడానికీ పనికిరాదు... ఇటు కాల్చడా...