Tuesday, October 31, 2023

శివోహం

నువ్వు రచించే మాయలోని నీకిష్టమైన పాత్రలం మేము...
నువ్వు వచించే  మాటల్లోని అందమైన భావాలం మేము...
నువ్వు దీవించే కాంతులలోని చైతన్య కిరణాలం మేము...
నువ్వు ఒకడివి ఉన్నావని తెలిసినా తెలియదన్నట్టు తిరిగే అజ్ఞానులం మేము..
మేమెలా ఉన్నా నువ్వు మాత్రం అలాగే ఉంటావు
మాలో మాకే అర్థం కాని నువ్వు లా.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!విష్ణువు నీలో విరిసేను
విశ్వ వ్యాప్తమై మెరిసేను
విశ్వనాథుడవు నీవని తెలిపేను
మహేశా . . . . . శరణు .

శివోహం

నీను పిలువగా నీ ఆలయం కు నే కదిలివస్తే ఉలుకవు పలుకవేల శివ...
కదలక మెదలక ఉండుటేల...
ఇంత కినుకు నీకెలా... 
నీలో కదలిక రాదెలా...
పట్టు వదలక ఉండుటెల...
నీ మౌనం వెనక మర్మం తెలికయనైతిని కదా హర...
నే పంతం విడువ...
వెనుకకు మరల...
పట్టు సడలక ఉన్న నీ తో మాట్లాడాలని...
మహాదేవా శంభో శరణు.

శివోహం

నా గుండె గదుల్లోకి ఆరుగురు దొంగలు చొరబడ్డారు...
నా యజమాని నీవే కదా.

మహాదేవా శంభో శరణు.

Monday, October 30, 2023

శివోహం

కోరికలు కోటియైనా తీర్చగలిగే కోటిలింగాల దేవుడవు...
ముక్కోటి దేవతలకు మూలవిరాట్టువు నీవు...

ఎన్ని బాధలు ఉన్న సంతృప్తికి మించిన సంపదలేమి ఉన్నాయి కార్తీకాధిపతీ...

అలాంటి తృప్తిని వరముగా ఈయవయా
పరమశివా.

మహాదేవా శంభో శరణు
ఓం పరమాత్మనే నమః.

శివోహం

నీ చరణ దర్శనం మా ముక్తి మార్గం...
నీ పాద ధూలీ నా నుదిటి విభూతి
నీ అభయహస్తం మాకు ప్రసాదించే అభయయం...
నీ కమల నయనాలు కురిపించే కారుణ్యం
నీ ఓంకారం నామం తో పరవాసించే సమస్త విశ్వం...
నీ నామా స్మరణ సర్వపాప హరనం
పరమేశ్వర ఈ మాయ నుండి విడిపించి మొక్ష మార్గం వైపు నడిపించు...
మహాదేవా శంభో శరణు.

Sunday, October 29, 2023

శివోహం

రుద్రాయ
రుద్రనేత్రాయ...
కాలాయ
కాలసంభవాయ...
త్రిగుణాయ
త్రినేత్రభూషితాయ...
అనంతాయ
అనంతరూపాయ...
ఆద్యాయ
అద్యదేవాయ...
లింగాయ
లింగస్వరూపాయ...
నటరాజాయ
నాట్యకుషాగ్రాయ.
శివాయ
నమః శివాయ...

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

జడలు కట్టినవాడు 
జగములు ఏలేటివాడు 
మూడు కన్నులవాడు 
మనసు మెచ్చినవాడు ...

భిక్షం ఎత్తువాడు 
బ్రతుకును ఇచ్చువాడు 
మౌనంగా ఉండువాడు
ముక్తిని ప్రసాదించువాడు ...

శివోహం  శివోహం

శివోహం

ఎద తలుపులు తట్టి చూడు...
ఎద నిండా నీ తలుపులే.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నీ కన్నున ఏమున్నా
ఆ కన్నున కరుణుంది
అది మా కంటికి వైలుగైంది
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ!!!
చిక్కులు పడిన
మన భక్తి ముడిని
ఎవ్వరు విడదీయ్యలేరు...

మహాదేవా శంభో శరణు.

Saturday, October 28, 2023

శివోహం

నా నడకలో నీ నామమొకటే
తోడుగా ఉంటుంది.

నిన్ను చేరే దారిలో భయమేమి కలగకుండా
నీవే ధైర్యం కల్గించాలి.

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

శివోహం

శివా!కట్టు కథలు కావు నీవి గుట్టు కథలు
ఆ గుట్టు కావాలి రట్టు  నిన్ను తెలిసేట్టు
"నేను"తెలియగనీయి  నిన్న తెలియగ నాకు .
మహేశా . . . . . శరణు .

శివోహం

నీను తలచినంతనే నా మనసు లోయలో ప్రతి ధ్వనిస్తుంది నీ నామం.

మహాదేవా శంభో శరణు.

Friday, October 27, 2023

శివోహం

ఎందుకో కానీ నిన్నటికి రేపటి కి మధ్య ఈ రోజంతా ఇరుకుగా ఉంటుంది...
ప్రతిరోజు ఇదే తంతు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నిర్మలత్వము కూడి నిన్ను కొలిచేను
తన్మయత్వము కూడి తపము చేసేను
ఏకత్వము నెరుగ యెదురు చూసేను
మహేశా . . . . . శరణు .

శివోహం

ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం గొప్ప కాదు ఆచరించడం గొప్ప.

ఓం నమః శివాయ.

Thursday, October 26, 2023

శివోహం

ఎందుకో కానీ నిన్నటికి రేపటి కి మధ్య ఈ రోజంతా ఇరుకుగా ఉంటుంది...
ప్రతిరోజు ఇదే తంతు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!పూజ చేసిన ఫలమున సిరల నొసగి
వేష వ్యవహారాల వైరాగ్యము తెలిపి
ముక్తి పదమును మాకు మప్పుమయ్యా
మహేశా . . . . . శరణు .

శివోహం

స్వామీ రామబక్త..
నిజమైన ఆచార్యుడవు అంటే నీవే తండ్రీ...
నాకు జ్ఞాన నేత్రం తెరిపించావు...
నీ కృపకు నోచుకున్న నేను నిజంగా అదృష్టవంతుడను...
హే గురుదేవా
వాయు పుత్రా
అంజనీ తనయా
హే రామ దూతా
వీర హనుమా
అభయ ప్రదాతా శరణు...

శివోహం

నీ గానం విననిదే నా చెవులకు ఆనందం లేదు...
నీ దేవాలయం దర్శించనిదే నాకు కళ్ళకి సంతోషం రాదు...
నీ నామ స్మరణ చేయకుంటే నా మనసుకు ఏమీ తోచదు...
ఎన్నాళ్లని ఈ ఎదురుచూపులు , ఇన్నేళ్లు ఈ ఎడబాటు...
ఈ గుండె మంటలార్పడానికి ఎన్ని కన్నీళ్ళు కార్చాలి నేను
ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఎన్నేళ్ళు ఈ కన్నీళ్లు....
కన్నీళ్ళతో మనసు తడిసి తడిసి ముద్దవుతోంది...
జాలి చూపి నీదరికి చేర్చు...
మహాదేవా శంభో శరణు.

Wednesday, October 25, 2023

శివోహం

శివ...
నీ దయ కలిగితే జీవులకు అన్నీ సిద్ధిస్తాయి...
దుఃఖాలు తొలగుతాయి...
లౌకిక సుఖములందు విరక్తులౌతారు...
జీవన్ముక్తులై ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు...
అందుకే నా హృదయమునందు నిర్మలమైన నీ జ్ఞాన పరమానంద రూపము ప్రకాశించేలా అనుగ్రహించు తండ్రి...
దానివల్ల కలిగే ఆనందనుభవంచే అలవికాని నా బాధలను మరిచిపోయి నీ పాదపద్మ ఆరాధనయందు ప్రీతి ని భక్తినీ పొందే అదృష్టాన్ని ఈ జీవుడికి ప్రసాదించు పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శృతి చేసి చూడు నా మదిని పలుకుతుంది నీ నామమే మోహనారాగం లో.
నాట్యమాడు తనివితీరా నా హృదయం లో.

శివ నీ దయ.

శివోహం

శివా!జనన మరణములు సంహరము చేసి
జగతి చక్రము నీవు తిప్పు చున్నావు
ఆ చక్రగతిని నా గతి తప్పించవయ్యా
మహేశా . . . . . శరణు .

శివోహం

ఊహ తెలిసిననాడు నిను ఎరుగనైతి...
మనసు తెలిసిననాడు బంధాలు గుమిగూడె...
మలినాలతో మనసు ముసురుకొని వున్నాది...
ఈ జన్మ నీ బిక్షే కదా తొలచి నీ సన్నిధికి నను చేర్చుకోలేవా...
శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నందిపై వున్నావు నిందలేకున్నావు
నరునిలో వున్నావు నడిపించు చున్నావు
నిన్ను తెలియగ నన్ను నడిపించవయ్యా
మహేశా . . . . . శరణు .

Monday, October 23, 2023

శివోహం

అందరితో కలసి జీవించి మరణించాక శరీరం తేలికగా ఉంటుంది ఆ నలుగురికి...

నిత్యం స్వార్థం తో జీవించి మరణించాక మోయలేనంత భారంగా ఉంటుంది

*ఓం నమః శివాయ*

Wednesday, October 18, 2023

శివోహం

శివ...
నీ నామము, నీ రూపం, నీ నామ స్మరణం
ఇవే నా మనసుకు పరిచయం...
నిత్యం నీరూపదర్శనంతో నీ నామ స్మరణమే నా దినచర్య...
ఏదో సమయంలో నీవొకసారి దర్శనం ఇవ్వగలిగితే ఇంకేం కోరుకోను...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!ఎల్లలెరుగని నీవు ఎల్లెడలా గలవు
ఏ రూపము నందైనా నీ వెలుగే విరిసినా
ఏదలో ఏదో తడబాటు, అది తొలగించు
 మహేశా . . . . . శరణు .

శివోహం

నిజం చెప్పాలంటే దుఃఖం తో నాకేమి బాధా లేదు...

సుఖం కోసం నేను కన్న కలలే నన్ను ఎక్కువగా బాధించాయి...

 ఓం నమః శివాయ.

Tuesday, October 17, 2023

శివోహం

శ్రీ మహాలక్ష్మీ దేవి...
మహాలక్ష్మీ దేవిని పూజిస్తే ధన ధాన్యాలకు లోటుండదు...
విద్యా, సంతానం వరాలుగా పొందుతారు...

ఓం శ్రీమాత్రే నమః.
ఓం శ్రీ మహాలక్ష్మీనే నమః

శివోహం

శివా!మనసు మాట వొదిలేస్తా
నిను చేరు మార్గమున అడుగేస్తా
నీ పదములు చూస్తూ గడిపేస్తా
మహేశా . . . . . శరణు .

శివోహం

ఈ లోకంలో సుఖంగా సంతోషంగా జీవించాలి అనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే 
నిజంగా ఈ లోకంలో ఎవ్వరునూ పరిపూర్ణమైన సుఖ సంతోషాలతో జీవించలేరు 
తమ మనసులో పరమాత్మ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులోనే జీవించే వారు మాత్రమే సుఖ సంతోషాలను అనుభవించగలరు.

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, October 16, 2023

శివోహం

శ్రీ అన్నపూర్ణా దేవి..
సకల జీవులకు అన్నం ఆధారం...
కాశీ విశ్వేశ్వరుడి ప్రియ పత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతున్నా అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటుండదు...
సకల ఐశ్వర్యాలు కలుగుతాయి...
ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ఆకలిదప్పులు వంటి బాధలు ఉండవు...
అన్నపూర్ణా దేవి ఈరోజు గంధం రంగు చీరలో దర్శనం ఇస్తారు. తెల్లని పుష్పాలతో పూజిస్తారు...
అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్ధోజనం నైవేద్యం పెడతారు. ఈరోజు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఓం శ్రీమాత్రే నమః

శివోహం

శివా!కూడబెట్టుకున్నాను కర్మ ఫలాలు
వదలించుకొనగ పడుతున్నా యాతనలు
ఏ కర్మ ఫలమూ వద్దు..
చేరనీ నీ చరణాలు...
మహేశా . . . . . శరణు .

Sunday, October 15, 2023

అమ్మ

దధానా కరపద్మాభ్యాం  అక్షమాలాకమండల:
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా...

ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్
అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ దేవి అమ్మవారు. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. గాయత్రీ మంత్రం జపిస్తే చతుర్వేదాలు చదివిన ఫలితం కలుగుతుందట. అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరలో దర్శనం ఇస్తారు. తామర పూవులతో అమ్మవారిని పూజించాలి. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ఎర్రటి గాజులు దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి తేజస్సు పెంపొందుతుంది.

శివోహం

శిక్షించడం దైవ నిర్ణయం కాదు...
పరీక్షించడమే దైవ మార్గం...
చేసిన కర్మలకు పశ్చాత్తాపం పడడమే...
మనిషి చేయగలిగిన కర్మమార్గం...

ఓం పరమాత్మనే నమః.

శివోహం

వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం...
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్...

ఓం శైలపుత్రినే ( బాలా త్రిపుర సుందరి) నమః

Saturday, October 14, 2023

ఓం

ఒక అంకం  ముగిసిపోతున్నది
నీవు ఏర్పరచిన జగన్నాటక రంగంలో 
ఒక పాత్ర ముగిసిపోతున్నది 

పాత్ర ఔచిత్యంలో నేను నా పాత్రకు 
న్యాయం చేసానో 
నటించానో 
జీవించానో 
నిర్ణయించే సమయం ఆసన్నమైంది 

ఏమి పొందానో 
ఏమి కోల్పోయానో 
ఏమి కోరుకున్నానో 
ఏమి ఆశించానో 
ఏమి వదులుకున్నానో 
ఏమి వదలకున్ననో 
ఏమీ జ్ఞప్తికి లేవు 

నా అస్థిత్వానికై 
పడిన తపన 
పొందిన ఆరాటం 
జరిపిన జీవన పోరాటంలో
నీ అస్థిత్వాన్ని గమనించక 
వృధా పరచిన కాలమెంతో 
నా అజ్ఞానాన్ని 
మన్నించి కరుణించు 

ఎంతో ఆరాటపడి 
ఎన్నో సంపాదించా 
విలువైన నీ సన్నిధి వదిలి
వెలలేని విషయాలను పట్టుకున్నా 
అంకెను వదిలి 
సున్నాలను మాత్రమే ఎర్పరచుకున్న
నా అమాయకత్వాన్ని 
దయతో మన్నించు 

అవసరమైన 
నీ అనుగ్రహాన్ని మాత్రము మరచి
అనవసరమైన 
ప్రతి విషయంలో మైమరచిపోయా 
శాశ్వతమైన నీ బంధాన్ని వదిలి
అశాశ్వతమైన బంధాలకు బందీయైన 
నా మూర్ఖత్వాన్ని 
వాత్సల్యంతో మన్నించు 

పశ్చ్యాత్తాపముతో పరితపించే జీవులకు 
నీ పద కమలముల శాశ్వత సన్నిధి ఒసగగల 
బోళా శంకరుడివని నమ్మి 
అవసాన సమయములో అర్ధిస్తున్నాను తండ్రీ 

నీ చరణ సన్నిధే నా పెన్నిధి గా మార్చు 
ఈ జన్మకైనా మరే జన్మకైనా 
నీవే నా తండ్రివై తోడు నీడగా నడిపించి 
నీచెంతనే నిలిచేలా అనుగ్రహించే 
బాధ్యత 
భారము నీదే
శివయ్యా  :'

శివోహం

నాలుగు ఉలి దెబ్బలు తిని ఓ రాయి శివలింగం అయింది...

ఎన్నో బాధలు తిన్న ఈ రాయి నీ కూడా శిల్పం చేయవయ్య...

శివ నీ దయ.

Friday, October 13, 2023

శివోహం

శివ...
నా మనసు స్వేచ్చాపశువు గా తిరుగుతోంది...
నీ నామ సంకీర్తన అనే మేత వేసి నీ లీలల పాశంతో కట్టివుంచు...
ప్రతి రోజూ నా ఈ జన్మ సార్థకం తెలియజేస్తూ నా యజమాని నీవే అనే స్మరణ తేరాదు.

మహాదేవా శంభో శరణు.
ఓం పరమాత్మనే నమః.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...