జీవితంలో ప్రతి ఒక్కటి పరమాత్మా అనుగ్రహంతో ఇవ్వబడ్డవి...
తల్లి తండ్రులు , భార్య బిడ్డలు , అస్తిపాస్తులు ఈ జన్మ నేను తెచ్చుకున్నది కాదు , కాబట్టి ఎప్పుడో ఒకసారి మల్లి తీసేసుకుంటాడు దేని మీద మనకి హక్కు లేదు , నేను తెచ్చుకోలేదు కాబట్టి ఇది నాది అని మమకారం పెంచుకోవడం లాంటి భ్రమ తగదు...
ఏది నీది కాదని తెలుసుకో ఎదో నాటికీ మనం ఏంచేస్తున్నాం అన్ని ననావిగా భావించి బంధించి
బడుతున్నాం...
నాది అంటే బంధము
నాది కాదు అంటే మోక్షము
నాది అంటే అపచారము
పరమాత్మా అంతా నీది అంటే ఉపచారము
నాదేది కాదు అన్నీ నీవే పరమాత్మా
నాది అంటే అపచారం
నీది అంటే ఉపచారము
ఏది చేసినా ఆ కర్మ పరమాత్మ కే చెందుతుంది.
నేను నాది అనే రెండు పఫలు ఈ శరీరంలో ఉన్నంత కలం మృత్యువుతప్పదు.
ఆ నేను నాది అనే భావన తొలగి,
నేను కర్తని కాను పరమాత్మ కర్త నేను భోక్తని కాను పరమాత్మా భోక్త అనే సత్ భావనతో అన్ని పరమాత్మకే అర్పిస్తే విముక్తిని
పొందుతాడు.
అటువంటి వాడు అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు
ఈ లోకంలో మొత్తం కోసం బ్రతికే వాడు దేవుడు, తన కోసం బ్రతికే వాడు జీవుడు.
అటువంటి లోక యుక్తుడు నిజమైన సన్యాసి.
సన్యాసి అంటే ఒక స్థితి అందరి కోసం బ్రతుకుతాడు అన్నిటా పరమాత్మని చూస్తాడు.
No comments:
Post a Comment