భౌతికమైన బంధాలన్నీ శాశ్వతం కాదని,
మొదలో,మధ్యలో,తుదలో
వదిలి వెళ్ళిపోవాలని,వెళ్ళిపోతాయని
నీతో బంధం ఒక్కటే శాశ్వతమని తెలుసుకున్నా ఈశ్వరా!
నీలో పుట్టి,నీతోడుగా పెరిగి,
నీలో చేరిపోయే నీ శిశువుని,
నువ్వే ఆలోచన,నువ్వే ఆచరణ
నువ్వే అంతా,నాబాట సరిచేసేది నీవంతు!
నీనామస్మరణ మాత్రమే నావంతు!
No comments:
Post a Comment