భగవంతుడు కావలనుకుంటే శరణు కోరడమే ముఖ్యోపాయము
నిన్నూ, చేరుకునే, సత్య ఉపాయము ఏదయ్యా
ఆది, నంత్యము లేని, అచ్యుత మూర్తి నీవయ్యా
నీ గుణాల్ని పొగడి నిన్నూ చేరాలనుందయ్యా
నీవు గుణాలను దాటిన గుణ రహితుడ వయ్యా
నిన్నూ నా మనసులో నిల్పుకోవాలినుందయ్యా
నీవు అంతులేని మహిమగల విశ్వవ్యాప్తుడయ్యా
చేతులారా పూజిస్తూ, ప్రార్ధించాలని ఉందయ్యా
నీవేమో, అనంత శరీరం తో, వి స్వవ్యాప్తుడవయ్యా
నీ కోరిక ఏదన్నా ఉంటే, తీర్చాలనీ ఉందయ్యా
నీ వేమో, సమస్త కోరికలు తీరిన వాడవయ్యా
నిన్నూ కనులారా చూసి, తరిద్దామని ఉందయ్యా
నీ వేమో చూపుకే దొర్కని, ఆగోచర మూర్తివయ్యా
ఉపాయంతో నిన్నూ చేరలేనని, అర్ధం ఆయిందయ్యా
శ్రీనివాసుని శరణు కోరటమే, నాకు దిక్కయ్యా
నిన్నూ, చేరుకునే, సత్య ఉపాయము ఏదయ్యా
ఆది, నంత్యము లేని, అచ్యుత మూర్తి నీవయ్యా
No comments:
Post a Comment