Thursday, January 4, 2024

శివోహం

నాదస్వరం వినిపిస్తే పుట్టలోని పాములన్నీ బయటికి వచ్చినట్లుగా, మీరు నామస్మరణ చేస్తే మీ హృదయంలోని దుర్గుణాలన్నీ తొలగిపోతాయి. నామస్మరణ చాలా పవిత్రమైనది. ఈనాడు నామస్మరణ తగ్గిపోవడం చేతనే దేశంలో బాధలు పెరిగిపోతున్నాయి. వీధివీధి యందు నామ సంకీర్తన చేయండి. శరీరంలోని అణువణువునూ, కణకణమునూ భగవన్నామంతో నింపుకోండి. నామస్మరణ వలన కలిగే ఆనందము, ధైర్యసాహసాలు ఇంక దేనివల్లనూ లభించవు. ఇతరులేమనుకున్నా ఫరవాలేదు, అపహాస్యం చేసినా పట్టించుకోనక్కర్లేదు. దృఢమైన విశ్వాసంతో నామస్మరణ చేసినప్పుడు మీరు అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. మీ మనస్సే ఒక వీణ. అందులో చెడ్డభావాలనే ‘అపస్వరాలు' రాకుండా చూసుకోండి. మనస్సనే వీణపై పవిత్రమైన భగవన్నామాన్ని పలికిస్తూ మీ జీవితాన్ని గడపండి. అప్పుడే మీకు భగవదనుగ్రహప్రాప్తి కలుగుతుంది.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...