శివ..
ఎన్ని జన్మలు ఇచ్చావు నిన్ను తెలుసుకునేందుకు...
కాలం కరిగిపోతోంది ఏళ్ళు గడిచి పోయినాయి అహం నన్ను వదలటంలేదు తండ్రి...
అహంకార నిర్మూలనకు అనేకజన్మల ఇచ్చే ఉంటావు మళ్లీ ఈ జన్మలైనా సద్వినియోగం చేసుకునేలా నీ భక్తి ఈ జన్మకు కలిగింది...
జన్మ పరంపరలు దహిస్తావు కదా నీవు...
అహాన్ని ఆమడ దూరం పెట్టి మనసు నీ పాదాల చెంత ఉంచి నువ్వే సర్వం అనే నమ్మిన భక్తునికి జ్ఞానాగ్ని ని అందించు తండ్రి.
No comments:
Post a Comment