Saturday, January 20, 2024

శివోహం

శ్రీరామ జయ  రామ జయజయ రామా
జగధభి రామ పావన నామ 2

శివుడే నిత్యం స్మరణము చేసే
మహిమాన్వితము  నీ నామం
స్మరణం మధురం శ్రవణం మధురం
తారక మంత్రం  నీ నామం

కౌశల్యా పతి కలల వెలుగువై
కన్నుల నిలిచిన కోదండ రామ
కౌశిక యాగము కాచిన ఘనత
కోటి దాటెను వినినంత

మిథిలా పురిలో  విల్లుని తాకి
నారిని కూడి రాజిల్లేవు
కళ్యాణమున కాంతుల మెరిసి
లోక కళ్యాణానికి కదిలేవు .

జనవాసమున శాంతి నింపగా
వనవాసమున సాగేవు
అసుర శక్తుల ఉసురును తీసి
విశ్వశాంతిని కూర్చేను

రాజ్య పాలనను రాజిల్లేవు
రామ రాజ్యమును చూపేవు
భవితకు బాటను చూపించేవు
ఆ బాటను నీవే భాసించేవు

ధర్మ రూపమును ధరియించి
దివ్య తేజమున వెలిగేవు
నాడు నేడు ఏనాడూ
ఆదర్శ మూర్తిగా తెలిసేవు

జయజయరామా జగదభిరామా
జానకిరామా శ్రీరామా

No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...