శివ,
నీ పాదకుసుమవ్వాలనే కామాన్నిన్కలగనివ్వు...
నిన్ను చేరక పలుతావుల తిరిగే మనసు పై క్రోధాన్ని పెరగనివ్వు...
నిరంతరం నిన్ను నా కనులారా చూడాలనే మోహాన్ని నిలువనివ్వు...
నీవు నా స్వామివనే లోభాన్ని వుండనివ్వు...
నా ఆర్తిని వేడుక తో చూసే నీపై నన్ను నీ దరికి చేర్చుకోలేదనే మాత్సర్యాన్నీ కలగనివ్వు...
నువ్వు కల్పించిన ఈ అరిషడ్వర్గాల పాషాలనుబ్నీ దరికి చేర్చే ప్రణవమార్గాలుగా మారనివ్వు.
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment