https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
ఆశలు అడియాశలై ఊహలు తలకిందులై...
సమస్యలు ఒక్కసారిగ ఉప్పెనై ముంచెత్తగ...
జీవన సంద్రాన నిరంతరంగా ఎదురీదుతూ...
జీవశ్చవమై బతుకీడుస్తున్న ఈదీనుడిని...
ఆత్మవిశ్వాసానివై వెన్నుతట్టి ధైర్యాన్నిస్తూ...
పరోపకారివై జీవించమని దారిచూపుతూ...
ఆత్మ సంతృప్తిని కలిగించిన ఓ నాదైవమా..
No comments:
Post a Comment