శివ!
ఏమని చెప్పేది...
ఎలాచెప్పేది
నీవు దేవదేవుడివి
నేను సామాన్య మానవుణ్ణి
కర్మ బద్ధుణ్ణి, కనికరం అంటే తెలియనివాణ్ణి
దారి తెన్నూ తెలియక నీ చెంత చేరుతున్నవాణ్ణి...
నీ కృపా కటాక్ష వీక్షణాలను
నాపై ప్రసరించిన నా బుద్ధి మారునేమో
నా పాపాలు తొలుగునేమో
నా అంతరాత్మ ప్రభోధంగా
నీ చెంత చెరియన్నను, నీవే నాకు దిక్కు.
No comments:
Post a Comment