Saturday, June 1, 2024

శివోహం

అంతులేని లోకంలో...
అనంతమైన రూపాలలో
ఎన్నెన్నో దేహాలు...
మరెన్నెన్నో బంధాలు
బంధాల వలలోనే మా బ్రతుకు జీవన బాటలు...
ఆ బాటలో నడిచేది మేమె ఐన నీవే హర.
సంబంధం అనే నాటకం తో ముడి వేసి...
అనుబంధం అనే మాయలో మమ్ములను ముంచి
చివరికి కర్మ బంధాలను తుంచి విలపించేలా చేస్తావు.
నీ ఆటలు నీవే.
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...