శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Wednesday, July 31, 2024
Monday, July 29, 2024
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నీపాద ధూళిని గ్రహించి లోకాల్ని
సృష్టించు నలువకు నీవె కర్త
ఈ ధూళి తలదాల్చి హరిమోయు భువనాలు
ఆయాస పడకుండ నీవె కర్త
ఈ ధూళి హరుడుయే ఒడలెల్ల పూసియు
నిను భక్తి తొ కొలుచు నీవె కర్త
త్రిముర్తి లీలల చేసేటి పనులకు
ప్రతిసృష్టి తరుణము నీవె కర్త
Saturday, July 27, 2024
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
ఉత్తమమైనది ఈ మానుష జన్మ...
జన్మజన్మాలుగా చేసిన పుణ్యాల ఫలం...
నీ పదసన్నిధి అది ఎంతటి భాగ్యం
విమలమైన మానసం ప్రశాంత జీవనం
నిశ్చల భక్తి నాకు ప్రసాదించు హర...
నిర్మల ఆసక్తిని కలిగించు సర్వేశ్వరా.
Thursday, July 25, 2024
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ
నీ కృపా కటాక్ష వీక్షణ దయా భిక్ష ఆశీర్వాదాలతో...
భుజించే ముందు కొన్ని మెతుకులు
ముందుగా సమర్పించడం నీకు నైవేద్యమే కదా తండ్రీ ...
నిదురపోయే ముందు నిన్నే తలచుకుంటూ మది పాడుకునే పావననామంనీకు పవళింపు సేవే కదా తండ్రీ ...
మేలుకొలుపులో నిన్నే ఆరాధిస్తూ శ్వాసిస్తూ హృదయం ఆలపించే గీతం నీకు సుప్రభాతమే కదా తండ్రీ ...
ఇవన్నీనీవు సమకూర్చిన సుఖాలే తండ్రీ నీవిచ్చిన ఈ సౌఖ్యాలను
నీకు సమర్పించడానికి కూడా ...
సవా లక్ష సందేహాలు ఎందుకో.
Sunday, July 21, 2024
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
భ్రమ అని తెలుసు
బ్రతుకంటే బొమ్మలాటని తెలుసు...
శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు...
ఈ బుడగ ఠప్పనీ పగిలిపోతదనీ
తెలుసు..
అన్ని తెలిసి జరిగేది,జరుగుతోంది నిత్యమని శాశ్వతమని ఈ వెర్రి పుర్రెకి ఎంత మిడిసిపాటో కదా..
ఈ పుర్రె నీ పాదముకింద పగిలే రోజు ముందుంది అని తెలుసు...
నీ ఆట బొమ్మ అని తెలుసు.
Saturday, July 20, 2024
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
అమరుల నిను మెప్పించిరి...
అసురులు నిను ద్వేషించిరి...
బ్రహ్మాది దేవతలు మునులు
మహావిష్ణువు నిను చేరి కోరి
అసుర ఆగడాలు వివరించి
నివారణ తరుణోపాయము
కోర విష్ణుమూర్తి గరళం
సృష్టించ దాచితి కంఠమున
ఆ విధమున సురుల రక్షించి
అసుర సంహార కారకుడైన
నినుచేరి ప్రార్థించు నను
దయతోడ కావుము
ఫణి భూషణ పార్వతీ పతిదేవ
పరమేశ్వరా పాహిమాం పాహి.
Friday, July 19, 2024
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
భక్తి లో మాధుర్యం ఉంటే...
భగవంతుడు తనకి తానే పట్టుబడతాడు అనడానికి నిదర్శనం హనుమంతుడే.
భగవంతుడి తో ఆనందం
దివ్యా నందం
నిత్యా నందం
సత్యా నందం
పరమానందం
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నా మనసుకు అనిపిస్తావు కాని కనిపించవు...
మాటలతో పిలుస్తాను మిమ్ము నీవేమో పలకవు...
ప్రతిరోజు ఇలానే పలకరిస్తూ ఉంటే
ఏదో ఒకరోజు కనిపించక పోతావా అని చిన్న ఆశా...
నీ రాక నా కోరిక
తీరిక చేసుకుని నాకోసం రావాలిక నన్ను ఎలాలిక.
Tuesday, July 16, 2024
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
తం దేవదేవం శరణం ప్రజానాం యజ్ఞాత్మకం సర్వలోక ప్రతిష్ఠమ్
యజ్ఞం వరేణ్యం వరదం వరిష్ఠం బ్రహ్మాణమీశం పురుషం నమస్తే.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం ఆత్మీయ మిత్రులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
జన్మ మనిషి జన్మే అయిన...
ఏమీ తెలియని నేనో పశువు నీ...
జ్ఞానమీయ నీవే గరువు నాకు...
నీవు ఏ జీవిని కరుణించినా నన్నునూ కరుణించవలె...
ఏ జీవిని చేరదీసినా నన్నునూ చేరదీయవలె...
ఏ జీవిని అక్కున చేర్చుకున్నా నన్నునూ అక్కున చేర్చుకొనవలె.
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నన్ను దిద్దుకో...
నీ దాసునిగా మలచుకో...
నీవాడిగా చేసుకో...
నేను నిన్ను మరిచిపోకుండా గుర్తు చేస్తూ...
నీవు మాత్రం నన్ను గుర్తు పెట్టుకో.
Monday, July 15, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY
శివ!
అదేమి లీలో మరి!
నా మాట మౌనంగా ఉన్నా...
మనసు మాత్రం ఊరూరా తిరుగుతూ నిలకడ
లేక విలవిలలాడుతుంది...
నా మంజీ తెలిసిన మహదేవుడివి నీవు.
నీ ఈ పాదాలు పట్టుకోవాలని వచ్చాను.
రాధే కృష్ణ
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY
కదిలిపోయే కాలంతో పాటుగా
కదలని చెదరని జ్ఞాపకం ఒక్కటైనా చాలు..
వేయి జన్మలకు తోడుగా నీడగా
కడవరకు కలిసిపోయే కమ్మని కలగా కధగా...
చేదు జ్ఞాపకమైనా తీపి గురుతులైనా
మరులు గొలిపే మధుర క్షణాలు...
కంట నీరొలికించే కన్నీటి కావ్యాలు
అస్వాదన లోని అనుభూతి అజరామరం.
Sunday, July 14, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY
ఏ జన్మలో బంధమో మనది...
తల్లితండ్రిని కాదని..
బార్యపిల్లలను మరిచి...
నీ మీదే నా ధ్యాస అయే...
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY
శ్రీ వేంకటేశా!
రెండు కనులు చాలవు నిను చూడ, నీ అలంకారాలు చూడ...
రెండు చెవులు చాలవు పాటలు విన, నీ కీర్తనలు విన!
రెండు చేతులు చాలవు దండాలు పెట్ట నీకు అడుగడుగు దండాలు పెట్ట...
రెండు పెదవులు చాలవు నామము పలుక, నీ సహస్ర నామములు పలుక...
రెండు జన్మలు చాలవు నిను కొలచ, జన్మ జన్మల కొలచ.
ఓం నమో వెంకటేశయా.
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY
నీ కొండలు నడిచి నీ రూపం చూడాలని ఉన్నది...
నీ హరివారసనం వింటుంటే నా మనసు శాంతమవుతుంది...
నీ దృశ్యం నా మనసుని నిర్దేహమయం చేస్తుంది...
నీ రూపం నా మాయను తొలగిస్తుంది.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
Saturday, July 13, 2024
Friday, July 12, 2024
Thursday, July 11, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ఇచ్చినను నీవే మా దుర్గమ్మవి !
ఇవ్వకనూ నీవే మా పెద్దమ్మవు !!
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
త్రినేత్రా త్రిలింగ దేవా...
త్రిశూల పాణీ పరమేశ్వరా...
పాపపరిహార పార్వతీపతి...
నా గుండెను వేదన చూడు...
గుండెలో గూడు కట్టుకున్న నన్ను చూడు....
వేదనలే నివేదనలు గా అర్పిస్తున్న నా భావాలు చూడు...
నిన్ను తలుచుకున్న ప్రత్రి సారి కన్నుల నుండి కారే కన్నీరు చుడు.
నీతో మాట్లాడాలని
నీతో ఉండాలని నే వచ్చా...
మౌనము దాల్చావు
మాటాడను అంటావు వేమి
మౌనంవీడి మాటాడు ఈశా
నీ మనసులోని భావాలు నాకెలా తెలుసు.
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
మనం నమ్మిన దైవమే మనకు రక్ష
కష్ట కాలంలోనైనా మహాదుఖం లో నైనా
బంధువులు , ఆప్తులు స్నేహితులు తోబుట్టువులు కూడా రాలేని చోట ఒక్క ఈశ్వరుడే మనకు అండ దండ..
మనల్ని సర్వకాల సర్వావస్థలయందు కాపాడగలిగేది
మహాదేవుడు ఒక్కడే
శివ నీవు తప్ప ఎవరు మాకు రక్ష అనే ఒకే ఒక మాట మనకు శ్రీరామ రక్ష.
శివ నీ దయ.
Wednesday, July 10, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నీవు మాకిచ్చిన ఆకలి అవసరాలు నిన్ను మరిచేలా
చేస్తున్నాయి...
ఆ పోరాటంలో నీ ధ్యాస తగ్గుతున్న మాట నిజమే...
నీవేమో ఆకలితో అలమటించే మమ్మల్ని చూడలేక
ఆహారం, నీరు, అగ్ని, గాలి రూపాలలో ఆకాశమంత అండగా కాపాడుతున్నావు...
కడుపునిండాక నిన్ను మరచి నిదరోయినా సోహం ఊయలూపి నిదురిస్తున్నావు...
నీ ఋణం ఎలా తీర్చేది తండ్రి..
రాతిరి నిదుర ఊపిరి నీకే అంకితం.
Tuesday, July 9, 2024
శివోహం
శివా!జన్మలెన్నొ ముగిసేను జన్మ తెలియకుండా
మరణమేమో వచ్చేను గుర్తు తెలియకుండా
ఎన్నాళ్ళీ ఆట గెలుపు వోటమి లేకుండా
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ,
మట్టితో బొమ్మను చేసి..
మనిషిగా ప్రాణం పోసి..
బంధానికి బందీ చేసి..
అనుబంధానికి నిచ్చేన వేసి..
అనుక్షణమూ ప్రేమను పెంచి..
సకలము,సర్వమూ శాశ్వతం అనే మాయను
పెంచి...
ఈ మాయ అనే ప్రాణం తీసి..
ఎన్ని ఆటలు ఆడిస్తున్నావయ్యా శివయ్యా..
ఈ జీవుడుని ఇన్ని ఆటలు ఆడిస్తూ ఏమి తెలియని అమాయకునిలా ఎట్టా కూర్చునావయ్యా..
నీకు నీవే సాటి వెరెవ్వరయ్యా.
Monday, July 8, 2024
శివోహం
శివా!కొండలెక్కి రావాలా నిను చూడాలంటే
ఇది ఏమి మాట చూపించు బాట
ఏది ఏమైనా నీదేగా ఆ భాద్యత
మహేశా . . . . . శరణు .
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
ఎన్ని కష్టాలు రానీ..
ఎన్ని సుఖాలు పోనీ...
నిన్ను తలిచే, కొలిచే పూజించే, భజించే భావించే అచంచలమైన భక్తివిశ్వాసాలను అనుగ్రహించు.. భావ దారిద్ర్యం రానీకు హర...
నాకు నీ స్మరణయే సుఖం...
నీ తలంపు లేని ఘడియలు కష్టం... మంగళకరము, మహిమాన్వితమైన నీ దివ్యవిగ్రహ దర్శన మహాభాగ్యాన్ని ప్రసాదించు...
మా కున్న కష్టాలలో కూడా నీ ఉనికిని గుర్తించే స్పూర్తిని శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి.
శరణు జగదీశా శరణు...
ఆదిదేవా శరణు...
మహాదేవా శంభో శరణు.
Sunday, July 7, 2024
Saturday, July 6, 2024
Friday, July 5, 2024
ఓం నమో వెంకటేశాయ
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
సమస్త చరాచర జీవరాశులకు శ్రీహరియే గతి. బ్రహ్మ రుద్రాదులకు కూడా శ్రీహరియే గతి. ఆయా యుగములలో ధర్మమును నిలబెట్టుటకు అవతారములెత్తిన పరమాత్మ, అశ్వమును అధిరోహించి కలియుగములో కల్కిగా, అలమేలుమంగాపతియైన శ్రీనివాసునిగా వెలసిన ఆ శ్రీహరే సమస్త చరాచర జీవరాశులకు గతి. భస్మాసురుని వంటి దుష్టులు, దారుణంగా మోసం చేసే వారు, సహనములేని శూరులు, శిశుపాలుని వంటి నీచులు అనేకులు ఈ సమాజాన్ని పట్టి బాధించే ఈ సమయంలో మమ్మలను పాలించేవారెవరు? సమస్త చరాచర జీవరాశులకు ఆ శ్రీహరియే గతి.
శివోహం
శివా! నీ భక్తి ప్రపంచంలో నేను
ఈ భక్త ప్రపంచంలో నీవు
కనిపించి కనిపించక కదలాడుతున్నాం
మహేశా . . . . . శరణు.
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ఎన్ని రకాలుగా నీ నామ స్మరణ చేసిన మెప్పించలేకపోయా..
నా భక్తి ఆలాపనలో అపశృతులనే నువ్వు గమనిస్తూన్నవేమో.
శివ నీ దయ.
Wednesday, July 3, 2024
Tuesday, July 2, 2024
Monday, July 1, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నాలో జీవుడు
నీవు ఆడుకునే
బొమ్మ అనేనా
నా వెనక నుండి
నన్ను పరుగెత్తించి
నీ ఒడిని చేర్చుకుంటూ
నేలపై పడవేస్తున్నావు
ఎన్నాళ్ళు ఈ ఆటలు శివా
నీ బొమ్మ నీ దగ్గరే ఉంచుకో
శివోహం
శివ!
నీకు తెలుసు నాడు నేను నీ దాసుడిని అని...
ఇప్పుడేమో క్రోధారాజు కొలువులో పడి నేడు దాసుడైతి...
నీ దాసుడు మరొకరికి దాసుడు అవ్వడం నీకు న్యాయమేనా
నీ మౌనం తో నా హృదయం నిశ్శబ్దం నీరయ్యింది..
ఓసారిటొచ్చి నా కళ్ళను తుడిచిపోవూ.
Subscribe to:
Posts (Atom)
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...
-
శివ! ఎన్నాళ్లని చూడాలి... నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి... కర్మ శేషం కొరకు కాలం తో పయనం ఇంకెంత కాలం. శూన్య స్థితం కొరకు జీవ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి అజ్ఞాన అంధ వినాశ ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u హరిహర పుత్ర అయ్యప్ప నా నడకలో నీ నామమొకటే తోడుగా ఉండేది. నిన్ను చేరే దారిలో భయమేమి కలగక...