Thursday, July 25, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ
నీ కృపా కటాక్ష వీక్షణ దయా భిక్ష ఆశీర్వాదాలతో...
భుజించే ముందు కొన్ని మెతుకులు
ముందుగా సమర్పించడం నీకు నైవేద్యమే కదా తండ్రీ ...

నిదురపోయే ముందు నిన్నే తలచుకుంటూ మది పాడుకునే పావననామంనీకు పవళింపు సేవే కదా తండ్రీ ...

మేలుకొలుపులో నిన్నే ఆరాధిస్తూ శ్వాసిస్తూ హృదయం ఆలపించే గీతం నీకు సుప్రభాతమే కదా తండ్రీ ...

ఇవన్నీనీవు సమకూర్చిన సుఖాలే తండ్రీ నీవిచ్చిన ఈ సౌఖ్యాలను
నీకు సమర్పించడానికి కూడా ...
సవా లక్ష సందేహాలు ఎందుకో.

మహాదేవా శంభో శరణు

No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...