https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
అంతా శివమయం అనీ తెలుసూ
అదీ శివమాయే అనీ తెలుసూ
మేమంతా శివమాయా సమ్మోహితులమే అనీ తెలుసూ
సదా నాలో నీవే ఉన్నావనీ తెలుసూ
తెలిసీ వలచీ విలపించుటలో
తీయదనం ఎవరికి తెలుసూ
ఏదో ఒక నాటి కి
అంతా నీ లో లయమనీ తెలుసూ
అదీ సదాశివ మాయే అనీ తెలుసూ
నీవే ముక్తినాధుడవనీ తెలుసూ
నీవే మోక్షప్రదాతవనీ తెలుసూ
నీవే లయకారకుడవనీ తెలుసూ
తెలసీ వలచీ విలపించుటలో
తీయదనం ఎవరికి తెలుసూ
అదీ నాలో నీకూ నాకే తెలుసూ.