Wednesday, September 18, 2024

శివోహం

శివ!
ధ్యానం లో నిను చూడగలను కానీ చేర లేను...
జీవంతో అనుభూతి పొందగలను కానీ నిను తాక లేను...
ఆత్మనని తెలిసాక ఈ మాయ నాటకంలో నటన ఎవరి కోసం అంతరాత్మ లో  ఒదిగాక విభిన్న పాత్రల పోషణ  ఎందు కోసం.
ఎన్నాళ్లని చూడాలి నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి...
దేహమే భారమని తెలిసినా సందేహమే ఇక లేదని  తెలిసినా...
ఎన్నాళ్లని చూడాలి నీ సన్నిధి చేరుటకు ఏన్నేళ్లని   ఎదురు చూడాలి.

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...