Sunday, September 8, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
అన్ని దోషాల మూటలే
మోయలేని ఈ భారాలను ఎవరి తల అయినా ఎంత కాలం మోస్తుంది...
దూరాలు దుర్భరాలు కాకుండా ఉండాలి అంటే భారాలను దించుకోవాలి 
వరించండం తేలిక కాదు
భారాలను బాధలను ఎత్తుకొనే వాళ్ళు ఎత్తి పెట్టేవాళ్ళు ఎందరైనా ఉంటారు..
దించుకొనే వాళ్ళు దించి పెట్టేవాళ్ళు
ఎక్కడున్నారు 

అందుకనే  అందరి బ్రతుకులు
మోయలేని భారాలుగా 
భరించలేని శాపాలుగా మారి పోతున్నాయి

బాధలను హరించేవాడు
పాపాలను తుడిచి పెట్టేవాడు
పరమేశ్వరుడు ఒక్కడే
అపరాధాలను మన్నించ మని
అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మార్చమని
ప్రార్థిస్తూ భగవంతుని హర హర మని ఎలుగెత్తి పిలుద్దాము...

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...