Sunday, September 8, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఓ మనసా! శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! కామాది అరిషడ్వర్గములను తెగత్రుంచి, అన్యస్త్రీలను, పరుల ధనాదులపై ఆలోచనలను త్యజించి, అజ్ఞానాన్ని విడిచి అత్యంత నియమనిష్ఠలతో బిల్వార్చనతో శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! సజ్జన సమూహములను దర్శించుకుని ఆ పరమశివుని మూడులోకాలకు అధిపతి అని గ్రహించి, దురభిమానము మొదలైన దుర్గుణములను తొలగించుకుని, మన హృదయకమలముచే పూజిస్తూ శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! వేదములను నుతిస్తూ అనవసరమైన సంభాషణలను కట్టి పెట్టి, భాగవతోత్తములను పోషించి, త్యాగరాజునిచే పూజించబడిన వాడని భావించి శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...