ఏ బంధము
కాలం గడిచినా
తరగక పెరుగుతుందో
ఏ బంధము
అహము స్వార్ధము
సోకక ప్రభావిస్తుందో
ఏ బంధము
నీ నా అని బేధము
ఎరుగక భాసిల్లుతుందో
అలాంటి బంధాలు
శాశ్వతము
ఈ జన్మకే కాదు
జన్మ జన్మలకు
ప్రతి బంధము
మొక్క లాంటిదే మొదట్లో
కానీ పెంచుకున్న కొద్దీ
వట వృక్షమై
తమకే కాదు తమ చుట్టూ
ఉన్నవారికి కూడా
ఆనందపు అమృతాల ఫలాలు
అందిస్తుంది ...
No comments:
Post a Comment