ఇహ పరముల నీకెవరు సరికారు
హరి నీదే ఈ ఘనత మరి నీవే హరి గనుక
మరి మరి నిను మది తలచిన మోదమే
అను నిత్యం అది మాకు అనుభవమే
సృష్టికర్తను సృష్టించిన ఘనుడవు నీవు
కర్మ సాక్షి కూడా కాంతులు అందించేవు
చరాచర జగతిని స్థితి కారక శక్తి నీవు
సర్వ ధర్మముల నీవె శోభించు చున్నావు
ధర్మానికి చేటుగా అసురత్వము అవరించ
అనువైన రూపాన ఆకృతి దాల్చి
నిజ తత్వము నుండి విడివడి వచ్చేవు
దుష్ట శిక్షణ చేసి శిష్టుల రక్షించేవు
యుగములు వేరైనా జగతి తీరు మారినా
అవతరించు లక్ష్యానికి ఆధ్యుడనీవు
నిలువరించ వీలులేని తేజము నీవు
నిత్యమైన సత్యానికి రూపము నీవు
No comments:
Post a Comment