https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
మొహమానేకెరటాలు చిక్కి ఉన్నాను...
సతి అనేడి సుడిలో పడి లేవకున్నాను...
బిడ్డలు , ప్రేమలు, బంధాలు బంధుత్వాలు వదలలేక నీ శరణు కోరుతున్న...
మహాదేవ శంభో శరణు.
శివా!స్పురణగా తెలియవస్తావు
కరుణనంతా కురియజేస్తావు
కంటికి మాత్రం కరువవుతావు
మహేశా . . . . . శరణు .
శివా!ప్రతిరోజు ప్రదోషం తెలుస్తుంది
జీవితాన ప్రదోషం ఎప్పుడో తెలియదు
అయిననేమి ప్రదోషం ప్రమోదం కానీ
మహేశా . . . . . శరణు .
శివా!లింగాన నిన్ను గుర్తెరిగి వున్నాను
గుర్తెరిగి నీ పూజ చేసుకున్నాను
పూజ పండనీ బ్రతుకు నిండనీ
మహేశా . . . . . శరణు .
No comments:
Post a Comment