Sunday, December 15, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నాలోనే వున్న నేను కై నేనుగా అన్వేషిస్తూ
నీ ఊపిరి నా శ్వాసగా
నీ పేరే నా తపనగా
నీ రూపే నేనుగా మారిపోయి
నీకై తపిస్తూ
నీకై జపిస్తూ
నీ కోసం కలవరిస్తూ ఎరుకతో
అంతఃర్గత యుద్ధమొకటి 
నాతోనే నాకు
మరుజన్మకు కరుణిస్తావని,
చిరునవ్వుతో నీలో లయం చేసుకునే వరమిస్తావని,
వేలసార్లు నేలరాలిన చిగురుటాకును నేను
చిదాగ్నియందు సమిధను నేను
ఎగిసె అలల కలల తీరం నేను
నీ పదసర్శపొందిన పరిమాణువును నేను
సదాశివా శరణు.

మహాదేవ శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...