Thursday, December 5, 2024

శివోహం

శివా!నీ పాద ద్వయమెక్కడో తెలియలేదు
అభయ హస్తమేదో అగుపించలేదు
కారుణ్య నేత్రాలు కనిపించలేదు ఏమిటిలా
మహేశా . . . . . శరణు .

శివా!చక్రధారివి నీవు కాకున్నా
జగతి చక్రము నీవె తిప్పుతున్నావు
జగదీశ్వరునిగా తెలిసి యున్నావు
మహేశా . . . . . శరణు .

శివా!తేజము తప్ప రూపములేని నిన్ను
రూపించు చున్నావు మా భావన ఎరిగి
భాసించు చున్నావు అభేదమెరుగ
మహేశా . . . . . శరణు .

శివా!సిగ నిండిన చల్లదనమెల్ల
జంట కన్నుల జేరి కరుణుగా మారి
జడ దారల జారి గంగా పొంగె
మహేశా . . . . . శరణు .

శివా!అక్షయమైనది నీ తేజం
విలక్షణమైనది నీ రూపం
అది అక్షులకందుట అపురూపం
మహేశా . . . . . శరణు .

శివా!కానరాని కంటికి కానవచ్చావా
కోర్కెలన్నీ ఒక్కసారి కాలిపోవు
కనిపించి భస్మాని కాననీయి
మహేశా . . . . . శరణు .

శివా!నేను నీ రాజ్యంలో వుంటూ
నీవు నాలో వున్నావనికంటూ
నేను రాజుగా బతికేస్తున్నా
మహేశా . . . . . శరణు .

శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ
నీ నామము నా పదమున దీపిక కానీ
నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ
మహేశా.....శరణు.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...