Thursday, February 6, 2025

శివోహం

శివా!నందికి కూడి నడదారి పట్టేవు
నా మోపునీయగ మరి సిద్ధమే
అధివసించగరమ్ము ఆట విడుపుగా
మహేశా . . . . . శరణు .

శివా!లోచనములకు అందవు
ఆలోచనలకు అందేవు
అనుభూతిని పంచేవు
మహేశా . . . . . శరణు .

శివా!నాలో స్పురణగా తెలిసేవు
 నాలో స్మరణగా సాగేవు
సర్వదా శుభమలే కూర్చేవు
మహేశా . . . . . శరణు .

శివా!నాకు శ్రమ లేకుండా మనసెరిగి
వానగా వచ్చి కరుణించేవా ఇలా
అభిషేకాన అలరించేవా భళా
మహేశా . . . . . శరణు


శివా!నిన్ను చూడలేని కంటిని వెలుగైనావు
నిన్ను తెలియలేని దేహాన తేజమైనావు
చిత్రాతి చిత్రాలు అన్నీ నీ సొంతమే
మహేశా . . . . . శరణు .

శివా!నేనుగా పూజ చేసాను
నీవే నేనుగ ధ్యానం చేసాను
శరణమే వరమని అర్ధించాను
మహేశా . . . . . శరణు .

శివా!భస్మరూపాన నీ దేహాన మెరియంగ
దేహాన్ని అర్పించి దేహీ అంటున్నాను
చేరనీకు నన్ను ఆ విధాత చూపు .
మహేశా . . . . . శరణు .

శివా!మాట నీవు ఆట నీవు
పరమెరుగగ బాట నీవు
పూజ తెలిసిన చోటు నీవు
మహేశా . . . . . శరణు.


శివా!పలుకు పరుగుతీసె నిన్ను చూసి
కాలము గుణము మారె కాసుల మెరిసి
తెలుసుకొనగ తేట తెలివి తెలియక విరిసె 
మహేశా . . . . . శరణు .

శివా!ప్రాణదీపమై ప్రభవించేవు
జ్ఞాన జ్యోతిగా తెలిసేవు
ఆ వెలుగున జ్ఞానం పంచేవు
మహేశా . . . . . శరణు .

శివా!ఆశలన్నీ తీర ఆశ నాది
శ్వాసలన్నీ తీర్చు బాస నీది
నిరాశ నను చేర శ్వాస సాగనీకు
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివా! పాప పుణ్యాల తాలూకు మూట నా భుజం మీదే ఉంది... నాది నాది నాదే అనుకుని పోగేసుకున్న పాపపుణ్యాలు నాకు తోడుగా ఉన్నాయి నన్ను వదలకుండా... ఆ మూట...