Monday, June 29, 2020

శివోహం

ఉన్నావయ్యా నీవు మాలోనే ఉన్నావయ్యా

ఉంటావయ్యా నీవు మాతోనే ఉంటావయ్యా

శ్వాసలో ధ్యాసవై ఊపిరిలో ఉచ్చ్వాస నిచ్చ్వాసవై ఉంటావులే

ధ్యానంలో దైవమై దేహంలో జీవమై మహా ప్రాణంగా ఉంటావులే

ఓం శివోహం ...........సర్వం శివమయం

శివోహం

నిన్ను చేరాలని ఒక్కో అడుగు వేస్తు...
పరుగు లాంటి నడకతో...
అలసటను లెక్క చేయక...
నిన్ను చూడాలనే తపనతో...
నా అణువణువు నిన్నే నింపుకుని...
విశ్రాంతిని సైతం మరిచి...
నీ చేతిని అందుకోవాలనే నా కోరిక...
రెక్కలు విప్పుకుని...
అన్ని అడ్డంకులు అధిగమించి...
నిన్ను చేరాలని సంకల్పం తో వస్తున్న... 
మహాదేవా శంభో శరణు...

శ్రీరామ

నిరతము ధర్మము నిలిపెడు వాడు 
చేసిన మేలుని మరవని వాడు
చేయి చాచకనే వరాలు నిచ్చువాడు
సూర్యుని వలెనె వెలిగేవాడు
సుగుణాలకు సరిజోడు వాడు 
సాగరమంత కరుణగల వాడు 
జగములునేలే  కోదండరాముడు వాడు..

శ్రీరామ శరణు...

శివోహం

హర హర మహాదేవా  శంకరా ....
హిమాలయాలకు  రాలేనయ్యా ....
మా ఊరిలోన  నీ ఆలయాన ....
మ్రొక్కుకొందు  నా మొర వినవయ్యా ..

మారు మూల  కుగ్రామము నాది  ....
నిరుపేదలు  నా జననీ జనకులు ....
ఊరు విడిచి  ఊరేగజాలను ....
నా ఇరుకు బ్రతుకు  నీకెరుక చేయగా ..

కలిగినదేదో  కనుల కద్దుకుని  ....
కాలము గడిపే  కష్ట జీవులము  ....
రెక్కలాడినా  డొక్కలు నిండని ....
నా ఓటి బ్రతుకు  నీకెరుక చేయగా ....

"సుందర కాండ " ఆలపించిన 
శ్రీ M.S.రామారావు గారి  శివ గీతమిది

శివోహం  శివోహం

శివోహం

తండ్రీ 
శివప్పా

అది
దరికి చేర్చుకునే 
దరహాసమా 

లేక
ముక్తిని ప్రసాదించే 
మందహాసమా 

శివోహం  శివోహం

శివోహం

శివుడు
ఎప్పుడూ ఎవ్వరినీ పలకరించడు

నీ ధర్మం
నీవు తెలుసుకొమ్మని

నీకు 
తెలియజేస్తూ ఉంటాడు

శివోహం  శివోహం

శివోహం

తండ్రీ 
శివప్పా 

నీ 
నామ స్మరణ జపంతో
నా 
హృదయం 

ఎప్పుడూ
ఎప్పటికీ 
యజ్ఞ వాటికే 
యజ్ఞ కుండమే 

శివోహం  శివోహం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...