Monday, June 29, 2020

శివోహం

హర హర మహాదేవా  శంకరా ....
హిమాలయాలకు  రాలేనయ్యా ....
మా ఊరిలోన  నీ ఆలయాన ....
మ్రొక్కుకొందు  నా మొర వినవయ్యా ..

మారు మూల  కుగ్రామము నాది  ....
నిరుపేదలు  నా జననీ జనకులు ....
ఊరు విడిచి  ఊరేగజాలను ....
నా ఇరుకు బ్రతుకు  నీకెరుక చేయగా ..

కలిగినదేదో  కనుల కద్దుకుని  ....
కాలము గడిపే  కష్ట జీవులము  ....
రెక్కలాడినా  డొక్కలు నిండని ....
నా ఓటి బ్రతుకు  నీకెరుక చేయగా ....

"సుందర కాండ " ఆలపించిన 
శ్రీ M.S.రామారావు గారి  శివ గీతమిది

శివోహం  శివోహం

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...