Tuesday, June 30, 2020

శివోహం



కళ్ళలో మెదిలే రూపం నీవు ...
కమ్మటి కలల్లోకి వచ్చెడి దివ్య రూపం నీవు ...

కనుల లోలోతుల్లోకి వచ్చి కలవరపెడుతుంటే ...
కనిపించేదంతా మాయగా అనిపిస్తోంది తండ్రీ ...

ఇక కనుకు పట్టేదెలా ముక్కంటీశా ...
ఇక మౌనం నాకు అలవడేదెలా ...‌

నా ... ఆశ... శ్వాస ... ధ్యాస ... నీవే కదా...

మహాదేవా శంభో శరణు

శివోహం

మాయ ఎరుగని...
మాయ మహామాయ...
ఆ మాయనెరిగిన....
వాడే మహాశివుడు...
ఓం శివోహం..... సర్వం శివమయం

Monday, June 29, 2020

శివోహం

ఆది అంతు లేని  ప్రయాణం...
గమ్యం తెలియని  జీవనం...
ఈ జీవుడి అనంత మైన యాత్ర...
ఈ జీవాత్మ ,ఆ పరమాత్మ తో అనుసంధానం చెందేవరకూ ఈ జీవన యాత్ర అలా అలా సాగుతూ పోవాల్సిందే...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

కష్టాలకు తెలియదు
నాకు తోడుగా 
కైలాస వాసుడు ఉన్నాడని

కన్నీళ్ళకు తెలియనే తెలియదు
నాకు అడ్డుగా 
సాక్షాత్తూ కైలాసమే ఉందని 

శివోహం  శివోహం

శివోహం

ఈశ్వరా ఒక్క సారి కనిపించర 
ఈ ప్రాణాన్ని నేను వదిలేస్తాను
అందించర నీ చేయి 
ఈ నరకాన్ని విడిచేస్తాను  
నిన్ను ఆరాధించే నేను ........
శివోహం..... శివోహం

శివోహం

నందీశ్వర....

ప్రాణనాధుని నేను సేవిస్తాను....

నువ్వింక కైలాసానికి వెళ్ళు...

నీకు పదవీ విరమణ వయసు వచ్చేసింది ....

నీ తరువాత వరుసలో నేనే ఉన్నానని నాతండ్రితో చెప్పు....

ఓం శివోహం.... సర్వం శివమయం...

శివోహం

లింగ రూపం లో 
అందరికీ దర్శన మిస్తావూ
కానీ నీ నిజ రూపం 
తెలియదయ ఎవరికీ
ఆది అంతం లేని 
ఆద్యుడవు  నీవూ
పరమ శివుడవు నీవు
నీ కంటూ ఓ స్థానం లేదు
నిరాకారుడవు నీవు
నిరంజనుడవు నీవు 
సదాశివా నిను నిరతము
పూజింతు నేను మహాదేవా!
మరు భూమిలో వశించే
భూత నాధుడవు నీవు
అన్నపూర్ణనే తిరిపమడిగిన
అర్ధనారీశ్వరువు నీవు 
సర్వ శుభంకరుడవు
ఓ సన్మంగళా కారా !
నమో నమః
                         

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...