లింగ రూపం లో
అందరికీ దర్శన మిస్తావూ
కానీ నీ నిజ రూపం
తెలియదయ ఎవరికీ
ఆది అంతం లేని
ఆద్యుడవు నీవూ
పరమ శివుడవు నీవు
నీ కంటూ ఓ స్థానం లేదు
నిరాకారుడవు నీవు
నిరంజనుడవు నీవు
సదాశివా నిను నిరతము
పూజింతు నేను మహాదేవా!
మరు భూమిలో వశించే
భూత నాధుడవు నీవు
అన్నపూర్ణనే తిరిపమడిగిన
అర్ధనారీశ్వరువు నీవు
సర్వ శుభంకరుడవు
ఓ సన్మంగళా కారా !
నమో నమః
No comments:
Post a Comment