Wednesday, July 1, 2020

శివోహం

నేను నాది అను భావన తో... 
దుఃఖమును అనుభవించుచున్నాను....
అహం స్వార్థం తో కూడిన నా మనస్సు....
అనే విచిత్రవస్తువు నీకు అర్పిస్తాను....
స్వీకరించి నా మనస్సును ఆనందపర్చు....
మహాదేవా శంభో శరణు....

శివోహం

హృదయాన్ని
అప్పుడప్పుడూ

కన్నీళ్ళతో
అభిషేకిస్తూ ఉండాలి

ఎందుకంటే
అక్కడ శివుడు ఉంటాడు

శివోహం  శివోహం

శివోహం

నీకు కష్టాలు బాధలు వచ్చాయని భయపడకు
ఇతరులకు ఎప్పుడూ చెప్పకు !!

ఇతరులు ఎప్పుడూ నీతో ఉంటారా 
వినడానికి లేదా ఓదార్చడానికి లేదు కదా !!

నీకు కష్టాలు బాధలు వచ్చినపుడు ఈశ్వరుడిని
గట్టిగా పట్టుకో  నిన్ను ఎప్పుడూ వదలడు !!

నీ బాధలు కష్టాలు ఈశ్వరునికే వినిపించు
ఎందుకంటే లోకంలో ప్రతి ఒక్కరికీ 
బాధ కష్టం తీర్చేవాడు ఈశ్వరుడు ఒక్కడే !!

ఓం నమః శివాయ........

శివోహం

శివా!పాశాన కట్టేవు లోకాన నెట్టేవు
కర్మ బంధాలంటు ఏవేవొ చుట్టేవు
ఏనాడు త్రెంచేవు ఈ కట్టులు
నీ చేతనే గలవు పనిముట్టులు
మహేశా . . . . . శరణు .

శివోహం

గోవిందా!!!తప్పులు మన్నించు 
తీపులు రుచిచూపించు 
ఆపదలు తొలగించు 
సౌభాగ్యము కలిగించు
భవములు మాన్పించు 
పుణ్యము ప్రసాదించు 
దారి మళ్లించు ముక్తి మార్గము చూపించు
ఎదుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవిందా
ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా

శివోహం

లోకమే నీవుగా బ్రతుకుతున్నా
నీ భక్తిలో మునిగి తేలుతూన్నా
జ్ఞాన వైరాగ్యంలో విహరిస్తూన్నా
వరములు నాకొద్దు , వరహాలు నాకొద్దు
సొమ్ములు నాకొద్దు , పుణ్యమూ నాకొద్దు
నీదర్శనము నాకివ్వు పరమేశ్వరా
నిన్నుకొలిచే శక్తిని ప్రసాదించు శంకరా.....

శివోహం

పరమేశ్వరా..........
తల్లినై జన్మనిచ్చి ,తండ్రినై సదాసంరక్షించి....
గురువై జ్ఞానంభోదించి , దైవమై మోక్షామిస్తున్నావ్...
ఈ జన్మలో నీ మేలు నే మరువగలను స్వామి ....
ఏ జన్మలోనైనా నీ ఋణము తీర్చుకోగలనా....
జన్మజన్మలకు నీనామజపము వీడగలనా శంకరా.....

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...