Monday, July 6, 2020

శివోహం

విశ్వాన్ని ఆక్రమించిన విశ్వరూపం నీవే
జగతిని శాసించే జగన్నాటక సూత్రధారి నీవే
నీకు సాటి ఎవరు లేరు..
నిన్ను దాటి ఎవరు పోరు...
నీకు నువ్వే సాటి పరమేశ్వరా.......
శివోహం.......శివోహం........

శివోహం

ఈశ్వారా,

నిన్ను పూజించిన సర్పము ఏ శాస్త్రమును అభ్యసింపలేదు

.నిన్ను భుజించిన ఏనుగు ఏ విద్యను నేర్వలేదు.

బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును నిన్ను అర్చించుటకై నేర్చుకొనలేదు

.నీ పూజ చేయుటకు సమస్త ప్రాణులకు

ఏ చదువులు అక్కరలేదు.

కేవలము నీ పాదములను అర్చించవలెనను కోరికయే అందుకు మూలకారణము.

రేయి పగలు  మనసు , మాట , మేను 
సదా నీ స్మరణంలో  నీ ద్యానములో ఉండే బుద్దిని ప్రసాదించుము తండ్రీ పాహిమాం...రక్షమాం....
ఓం....
శివోహం....

శివోహం

కష్టసుఖాల రెండింటికి....
కరిగిన గుండె....
కన్నీళ్ళని కురిపిస్తోంటే....
కోరికల బరువును తాళలేక....
కస్సుమని ఉబికి వస్తోంటే....
నీకు కమ్మగా ఉందేమో నా కన్నీరు....
అదే నీకు జలాభిషేకమనుకో తండ్రీ ...
మహేశా శరణు శరణు.......

శివోహం

విశ్వాన్ని ఆక్రమించిన విశ్వరూపం నీవే....

జగతిని శాసించే జగన్నాటక సూత్రధారి నీవే....

నీకు సాటి ఎవరు లేరు.....

నిన్ను దాటి ఎవరు పోరు.....

నీకు నువ్వే సాటి పరమేశ్వరా.......

ఓం శివోహం.......సర్వం శివమయం

శివోహం

అమితమైన కోరికలే....

అనంతమైన వ్యధలకై....

మనసార శివుణ్ణి పరితపిస్తే....

మనోక్షోభకు కాలం మూడినట్టే...

మంచికి చేరువైనట్టే....

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

జనన మరణాల 
జీవిత చక్రంతో 

ఈ జగతిని 
శాసిస్తున్నది నీవే కదా తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

జీవుని లో ఉన్నది ఆత్మ 
దేవుని లో ఉన్నది పరమాత్మ
బ్రతికినంత కాలం ఈ లోకంలో
మరణించిన తర్వాత పరలోకంలో
మానవునిలో ఉండే ఆత్మ పరమాత్మ

ఆత్మ ఉంది కాబట్టి పరమాత్మ ఉన్నాడు
ఇహలోకం ఉంది కాబట్టి పరలోకం ఉంది

పుట్టింది ఉన్నప్పుడు పుట్టించే వాడు ఉన్నాడు
పుట్టించేవాన్ని  పుట్టించేవాడు పుట్టాడు
తనకు తానుగా ఉన్నాడు

స్వయంభూగా పుట్టినవాడు మరణిస్తాడు
స్వయంభువుకు మరణం లేదు

పుట్టిన ప్రతివాడు ఒకప్పుడు మరణించిన వాడే
మరణించిన ప్రతివాడు మళ్లీ పుట్టబోయే వాడే
చావుపుట్టుకలు ఉన్నవాడు జీవుడు
చావు పుట్టుకలు లేనివాడు దేవుడు

మరణిస్తూ పుడుతూ ఉండే జీవునిలో 
మరనించకుండ ఉండేది ఆత్మ 
మరణించదు కాబట్టి ఆత్మ స్వయంభువు
పరమాత్మ స్వయంభువు కాబట్టి ఆత్మే పరమాత్మ

ఆత్మ కనిపించదు కాబట్టి పరమాత్మ కనిపించడు
దేహం ఉన్న జీవుడు కనిపిస్తాడు
దేహం లేని జీవుడు కనిపించలేడు

దేహం వీడిన ఆత్మ ఎక్కడ ఉంటుంది
దేహ రహిత ఆత్మ-పరమాత్మ లో లీనం అవుతుంది
మరి అయితే పరమాత్మ ఎక్కడ
ఈ అనంత విశ్వం అంతా పరమాత్మే

ఓం నమః శివాయ.....

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...