Friday, July 10, 2020

అమ్మ

దేవతల గణములకు నాయకివి...
శర్వుని ఇల్లాలివి...
పర్వతరాజుకి ముద్దుల కూతురివి...
ఇక నా లౌకిక , ఆధ్యాత్మిక జీవనాన్ని నడపలెకుండా నా మదిని నీ శరణుజొచ్చాను...
దేవతలు , దానవుల  యుద్ధ రంగములో నీ శౌర్యము తిరుగులేనిది...
నీ గాంభీర్యము సముద్రము వంటిది...
నీ స్వరము కొకిల దేవతలను మించినది...
ఇక పరితాపము ,విరహము తాళలేకపొతున్నాను ఓ మంచి పనులు చేయించు...
అమ్మ మాయమ్మ దుర్గమ్మ శరణు.  

శివోహం

సూత్రధారివై పాత్రల జూపి నీవు 
         పుడమి రంగస్థలంబున పొల్పుమీర 
         జనుల నిల్పి యాడింతువు జక్కగాను
         కర్మ బంధములెల్లను కాలి పోవ,
         పాత్రలకు సెలవిత్తువు భావజారి

శివోహం

ఏ శ్వాస చివరిదో....
ఏ అడుగు తుది అ డుగో....
ఏ బంధం..... ఎటో మళ్లీస్తుందో.... ఏ క్షణం ఎలా శాసిస్తుందొ... ఈశ్వరా

నడిచే దారి లో మార్గ బంధువు అయి.... వెంట రా.... చూసే చూపు కు గమ్యమై నీవు ఉండి పో..!!

చేసే ప్రార్థన కు.... పలుకు లు. పరంపరగా ఉండిపో...!

వేడుకునే వేదనకు వేదమై తోడు రా...!!

చూసే నా చూపు కు లక్ష్య మై... శాస్విత చిత్రమై హృదయం లోకి చేరి పో....!!

వేడుకోలు అనుకో...
వేడుక అనుకో...!

వేదన అనుకో... నీ కోసమే చేసే వాదన అనుకో... ఎది ఏమైనా నాతో ఉండిపో...!

నిన్ను గా మార్చు కో.... మహా దేవ శరణు శరణు..!!

Thursday, July 9, 2020

అమ్మ

అమ్మా...
జగన్మాతా...

నీవు లేనిదే ఏదీ లేదు

ఏదీ లేని క్రితం నువ్వే వున్నావు

సృష్టించేవాడు

స్థితించేవాడు

లయపరిచేవాడు

వీరు నీ నియామకులు

నీ ఆజ్ఞను పాలించేవారు

నిను స్తోత్రించేవారు

నీ దాసులు

తల్లీ....నీవు మాత్రమే ఈశ్వరివి....

శివోహం

సమస్తమైన ఆత్మలూ తానై అయినవాడు..

సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు..

సమస్తమూ తానై అయినవాడు..

సమస్త జగత్తులను సృష్టించువాడు..

జడలు గల శిరస్సుతో శోభిల్లువాడునూ..

అతిమృదువైన లేడి చర్మమును ధరించువాడునూ..

జడలమధ్యభాగమున గల శిఖలయందు పింఛములను ధరించువాడునూ..

దేహమునందు అన్ని అవయవములతో పూర్ణత్వము కలవాడునూ..

సర్వమైన భావనలకూ తాను మాత్రమే మూలమై వెలుగొందువాడునూ....

అయినటువంటి ఉమామహేశ్వరునకు సహస్ర ప్రణామములు ఆచరించుచున్నాను.

                  శివా సర్వమూ నీ దయ .

శివోహం

జన్మలో దుఖం
మరణంలో దుఖం
జీవితంలో దుఖం
మరి ఎందుకు ఈ జన్మ జీవుడా 

ఎందరో మహానుభావులు 
పుట్టిరి పెరిగిరి
ఎన్ని ధర్మ ఉపన్యాసాలు
వెదజల్లి నారో ఏరుకో జీవుడా

దుర్మార్గులకు దూరంగా 
సన్మార్గులకు సమీపంగా
ధర్మ మార్గానికి దగ్గరగా ఉండి
యోగమార్గంలో సాగిపో జీవుడా

రారమ్ము శివ సామ్రాజ్యంలోకి
సభ్యులము అయిపోదాం
శివుడితో ఆనందంగా గడుపుదాం
శివుని కృపా కటాక్షము పొందుదాం

ఈ జన్మ తుది జన్మగ సాధన చేసి
ఆత్మ గా ప్రకాశిస్తున్న మనము
పరమాత్మలో లీనం అవుదాం 

ఓం నమః శివాయ....

హరే

పరమాత్మా....వాసుదేవా....

నీ నామస్మరణలో ఇహపరాలు రెండూ గుర్తుండవు..
శరీరము తోపదు...
మనసు నీరూపంతో ఐక్యమైపోతూ 
ఆనందాన్ని అనుభవిస్తూ 
నీతో చిందులు వేస్తూవుంటుంది. 
చెప్పుటకు సాధ్యముగాని ఆనందము...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...